జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఇటీవలే పవన్ కళ్యాణ్ ఒక సభలో మాట్లాడుతూ తనతో సీఎం అయ్యే అంత సీన్ లేదు అని బహిరంగంగానే తెలిపిన విషయం తెలిసిందే.కేవలం తాను పొత్తులు పెట్టుకుంటాను తప్పితే.సీఎం అయ్యే ఛాన్స్ లేదని చెప్పకనే చెప్పేసి జనసైనికులు ఆశలపై నీళ్లు చల్లారు.2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )సీఎం అయిపోతారు.
జనసేన( Janasena ) అధికారంలోకి వచ్చేస్తారు అంటూ కలలు కన్న జనసైనికులకు అసలు వాస్తవాలను చెప్పి కళ్లు తెరిపించే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్.అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది పవన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇప్పటికే చాలామంది జనసైనికులు ఎన్నాళ్లు వేరే పార్టీల జెండాలు మోస్తాం.సొంతపార్టీ జెండా మోసేదెప్పుడు మన నాయకుడ్ని సీఎంగా చూసెదెప్పుడని ప్రశ్నిస్తున్నారు.
మరికొందరైతే పవన్ కళ్యాణ్ ఏం నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే కట్టెకాలే వరకూ జనసేన జెండాను దింపేదే లేదని అంటున్నారు.కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కి వీర విధేయుడు జనసైనికుడు ప్రముఖ యూట్యూబర్ అనీల్ కుమార్ యాదవ్ దేశ్ ముఖ్( YouTuber Anil Kumar Yadav Deshmukh ) తన యూట్యూబ్‌లో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు హాట్ టాపిక్ గా మారింది.గత కొన్నేళ్లుగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్‌కి వీర విధేయుడుగా ఉన్న అనీల్ కుమార్ దేశ్ ముఖ్ సందర్భం వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఉన్న భక్తిని చాటుకుంటూనే ఉన్నారు.తమ నాయకుడ్ని ఎవరైనా ఏమైనా అంటే యూట్యూబ్‌లో అంతెత్తున లేచే అతనికి అభిమానులు ఉన్నారు.అయితే అలాంటి పవన్ భక్తుడు ఇప్పుడు అధినేత తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం వీడియో వదిలారు.

జనసేన పార్టీకి గుడ్ బై అంటూ వీడియో పెట్టి చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు.నాకు అసలు రాజకీయాలు అంటే ఇష్టంలేవు.క్రికెట్ సినిమాలు అంటే బాగా ఇష్టం.పేపర్లో పవన్ కళ్యాణ్ పోస్టర్ పెడితే ఆ పేపర్ దొంగతనం చేసి మరి ఆ పేపర్ ని ఇంటికి తెచ్చుకొని మరి అతికించుకునేవాడిని.
అంత ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే.అసలు రాజకీయాలంటేనే నాకు ఇష్టం ఉండేది కాదు అస్సలు పట్టించుకునేవాడ్నే కాదు.కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టారో అప్పటి నుంచి రాజకీయాలపై అవగాహన పెరిగింది.ఆయన్ని చూస్తూ, ఆయనలా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో.ఆయన కంటే ముందుగానే ఎలక్షన్స్‌లోపోటీ చేయడం జరిగింది.2019 ఎన్నికల్లో మా ఊరిలో సర్పంచ్ ఎన్నికలు జరిగియి.అప్పుడు నేను జనసేన పార్టీ తరుపున సర్పంచ్‌గా పోటీ చేయాలని అనుకున్నాను.కానీ జనసేన పార్టీ తెలంగాణలో లేకపోవడం వల్ల నేను ఇండిపెండెంట్‌గానే పోటీ చేశాను.కుళ్లు పట్టిన రాజకీయాలను కడిగేయాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్‌లు నన్ను బాగా ప్రభావితం చేశాయి.ఇళ్లు ఏమో దూరం.
దారి నిండా గోతులు చేతిలో దీపం లేదు కానీ.గుండెల్లో ధైర్యం ఉందిఅంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్‌లు.
పవన్ కళ్యాణ్ తప్పి చేస్తే తలకాయ తీసేయాలని చెప్పిన డైలాగ్‌లు తల ఎగిరిపడాలి తప్పితే అస్సలు వెనకడుగు వేయను.వెన్నుచూపను నాకు డైలాగులు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేశాయి.
మేము కోరుకునేది ఒక్కటికే ఎప్పటికైనా మీరు సీఎం కావాలి అదే మా కోరిక అని తెలిపాడు.







