తాజాగా ఇల్లినాయిస్‌లోని( Illinois ) చికాగోలో భారీ తాబేలు ప్రత్యక్షమైంది.చికాగో నదిలో తుప్పుపట్టిన గొలుసుపై విశ్రాంతి తీసుకుంటున్న ఈ భారీ తాబేలును గుర్తించిన ఇద్దరు కయాకర్లు మొదట షాక్ అయ్యారు.
వామ్మో ఇంత పెద్ద తాబేలు( Big turtle ) ఎప్పుడైనా మీరు చూశారా అంటూ దానిని వీడియో కూడా తీశారు.దానికి “చోంకోసారస్”( Choncosaurus ) అని పేరు పెట్టారు.
క్రైమ్ పేస్ బట్ బోటనీ డజ్ నాట్ అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్న జోయ్ సాన్‌టోర్, తాబేలును షూట్ చేసి ట్విట్టర్‌లో షేర్ చేశాడు.ఇంటర్నెట్ యూజర్లు దీన్ని చూసి స్టన్ అవుతున్నారు.
వీడియోలో జోయి, అతని స్నేహితుడు అల్ స్కోర్చ్ మందపాటి తాబేలు పరిమాణాన్ని చూసి తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.ఈ వీడియోలో జోయి తాబేలును అభినందిస్తూ, ఆరోగ్యంగా ఉంటున్నావా, తింటున్నావా అని సరదాగా అడగడం కూడా వినవచ్చు.ఈ క్లిప్ షేర్ చేసిన వెంటనే వైరల్ అయ్యింది, ట్విట్టర్‌లో 10,000 లైక్‌లను సంపాదించింది.తాబేలు పిజ్జాలు బాగా తింటుంది అనుకుంటా అందుకే అంత లావు పెరిగిపోయిందని ఒక నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశారు.
అయితే, క్రిస్ యాంకర్( Chris Anchor ) అనే వన్యప్రాణి జీవశాస్త్రవేత్త, తాబేలు పెద్ద సైజుకు శరీర కొవ్వు కాకుండా ఇతర కారణాల వల్ల కావచ్చునని వివరించారు.అది గుడ్లు గల తల్లి తాబేలు అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.తాబేలు గర్భం దాల్చడాన్ని తాబేళ్లు స్నాపింగ్ చేయడం అంటారు తాబేళ్లు దాదాపు 30 కిలోల వరకు బరువు పెరగగలవు.వైరల్ వీడియోలో కనిపించింది మాత్రం 20 కిలోల బరువు ఉంటుందని తెలుస్తోంది.
ఏది ఏమైనా ఈ భారీ తాబేలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.