ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అధికార పార్టీ వైసీపీ( YCP ) వర్సెస్ ప్రతిపక్షాలు అన్నట్టు ఉన్నాయి.ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్ష నాయకులు అంచనా వేస్తున్నారు.
ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం ముందస్తు వస్తే తాను జూన్ నెల నుండి అందుబాటులో ఉండబోతున్నట్లు మీడియా సమావేశంలో కామెంట్లు చేశారు.దీంతో పార్టీ నేతల మధ్య మాటలతూటాలు విపరీతంగా పేలుతున్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ మంత్రి ఆది మూలపు సురేష్( Adimulapu Suresh ) టిడ్కో ఇళ్ళ విషయంలో కొన్ని వార్తా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.ఇదే సమయంలో ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని సూచించారు.టిడ్కో ఇళ్ళ నిర్మాణంలో టీడీపీ కాంట్రాక్ట్ పాత్ర మాత్రమే పోషించింది.నివాసయోగ్యంగా లేని ఇళ్లను వైసీపీ పూర్తి చేసిందని స్పష్టం చేశారు.టీడీపీ పంక్చర్ పడిన ట్యూబ్ లాంటిదనీ దానికి కొన్ని మీడియా సంస్థలు గాలి కొట్టిన వేస్ట్ అంటూ మంత్రి ఆది మూలపు సురేష్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.