ట్రంప్ కాలం నాటి ‘‘టైటిల్ 42 ’’ ( Title 42 ) గడువు గత గురువారంతో ముగిసిన నేపథ్యంలో అమెరికాలో( America ) వలసదారుల సంఖ్య 50 శాతం తగ్గిందన్నారు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్.( President Joe Biden ) యూఎస్ – మెక్సికో సరిహద్దు గుండా అక్రమంగా ప్రవేశించేవారిపై బైడెన్ పరిపాలనా యంత్రాంగం భారీగా జరిమానాలను విధిస్తుండటంతో అక్రమంగా బోర్డర్ దాటే వారి సంఖ్య సగానికి పైగా పడిపోయిందని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది.
హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్ సీఎన్ఎన్ వార్తాసంస్థతో మాట్లాడుతూ.గడిచిన రెండు రోజులుగా వలసలు గణనీయంగా తగ్గాయన్నారు.
ఇవి ‘‘టైటిల్ 42’’ ముగింపు కంటే తక్కువని ఆయన తెలిపారు.శుక్రవారం 6,300 మంది.శనివారం 4,200 మంది సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారని మయోర్కాస్ వెల్లడించారు.టైటిల్ 42 గడువు ముగిసిన తర్వాత దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వలసదారులకు జరిమానాలు విధించడమే క్రాసింగ్‌లు తగ్గడానికి ప్రధాన కారణమని ఆయన చెప్పారు.
అమెరికాకు రావడానికి చట్టబద్ధమైన, సురక్షితమైన మార్గం వుందని.చట్టబద్ధమైన మార్గాలను వినియోగించకపోతే దానికి పర్యవసానాలు వేరుగా వుంటాయని మయోర్కాస్ తెలిపారు.
రెండ్రోజులుగా అందరూ భయపడుతున్న దానికి భిన్నంగా సరిహద్దుల వెంబడి పెద్ద ఎత్తున క్రాసింగ్‌లు కనిపించలేదని బోర్డర్ పెట్రోలింగ్ అధికారులు సైతం ధ్రువీకరించారు.

ఈ నేపథ్యంలో టైటిల్ 42 గడువు ముగియడం, దేశంలో అక్రమ వలసలపై జో బైడెన్ స్పందించారు.యూఎస్-మెక్సికో బోర్డర్‌లో( US – Mexico Border ) పరిస్ధితి మీరంతా ఊహించిన దానికంటే చాలా మెరుగ్గా వుందన్నారు.అయితే తక్షణం సరిహద్దును సందర్శించాలనే ఉద్దేశం తనకు లేదని బైడెన్ స్పష్టం చేశారు.
అమెరికాలో అడుగుపెట్టాలంటే.బైడెన్ పరిపాలనా యంత్రాంగం ప్రకటించిన మైగ్రేషన్ ప్రాసెసింగ్ ప్లాన్‌ల ప్రకారం.
శరణార్ధులు యాప్ ద్వారా అపాయింట్‌మెంట్ బుక్ చేసువాలి.లేనిపక్షంలో యూఎస్ సరిహద్దుకు చేరుకునే మార్గంలో వారు దాటిన దేశాల నుంచి రక్షణ పొంది వుండాలి.
అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా సరిహద్దును అక్రమంగా దాటి పట్టుబడితే ఐదేళ్ల పాటు ఇమ్మిగ్రేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం వుండదు.అంతేకాకుండా జైలు శిక్షలు కూడా పడతాయని అధికారులు తెలిపారు.

టైటిల్ 42 అంటే ఏమిటీ.?
2020 మార్చిలో కరోనా మహమ్మారి అమెరికాలో విజృంభిస్తున్న సమయంలో ‘‘టైటిల్ 42’’ నిబంధనలు తీసుకొచ్చారు అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కోవిడ్ సోకిన వ్యక్తులు దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి, సరిహద్దుల వద్ద భద్రత నిర్వహించే సిబ్బంది వారిని తక్షణం దేశంలోకి అనుమతించకుండా ఈ నిబంధనలు రూపొందించారు.కోవిడ్ 19 వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో యూఎస్- మెక్సికో సరిహద్దుకు వచ్చిన వలసదారులను అడ్డుకోవడానికి బోర్డర్ సెక్యూరిటీ అధికారులకు ప్రభుత్వం ఈ టైటిల్ 42 ద్వారా అధికారాలు కట్టబెట్టింది.
వీటి కాలపరిమితి మే 11తో ముగిసింది.







