యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కుంటున్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ ( District Collectorate )లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం( Praja vani ) అధికారుల ఆలస్యంతో వెలవెలబోయిందని తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ అన్నారు.
సోమవారం యాదాద్రి కలెక్టర్ కార్యాలయంలో ( Yadadri Bhuvanagiri ) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి తమ సమస్యలను విన్నవించేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చినా ఉదయం 11 గంటల వరకు ఒక్క అధికారి రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
వివిధ సమస్యలతో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు అధికారులు లేక దిక్కు తోచని స్థితిలో పడ్డారని వాపోయారు.ఫిర్యాదు దారుల గోడును వినడానికి సరైన సమయానికి విధులకు హాజరుకాని అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.







