యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young tiger NTR ) టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ( Koratala shiva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”NTR30”( NTR30 ).కొరటాల ఆచార్య వంటి భారీ ప్లాప్ ఇచ్చిన కూడా ఈయనను నమ్మి తారక్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాడు.
మరి ఆ అంచనాలను కొరటాల కూడా నిజం చేసుకోవాలని పక్కా స్క్రిప్ట్ తో బరిలోకి దిగాడు.

చాలా సమయం కేటాయించి మరీ ఇటీవలే ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ చేసుకుని షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అందులోను వీరి కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది.
అందుకే వీరి కాంబోలో రాబోతున్న రెండవ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ పాన్ ఇండియన్ సినిమా నుండి ఏదొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వస్తూనే ఉంది.
తాజాగా మరో అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.
ఐతే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉందని టాక్ వస్తుంది.

మరో బాలీవుడ్ బ్యూటీని ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారట.ఆమె ఎవరంటే అనన్య పాండే అని తెలుస్తుంది.ఈమె ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తుంది.
అయితే ఈ వార్త విన్న ఫ్యాన్స్ కొరటాలపై మండి పడుతున్నారు.ఎందుకంటే ఈమె లైగర్ సినిమాతో పూర్తిగా విఫలం అయ్యింది.
అందుకే ఈమె నటన నచ్చని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.ఈమె ఏ మాత్రం ఆకట్టుకోలేదు అని అంటున్నారు.
మరి ఫ్యాన్స్ అభ్యర్ధన కొరటాల మన్నిస్తారో లేదో చూడాలి.
ఇక విలన్ రోల్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.
యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.







