ఓడలు బండ్లు బండ్లు ఓడలు కావడం గురించి మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటామనే సంగతి తెలిసిందే.ఒకప్పుడు టాపర్ అయిన విద్యార్థి తర్వాత రోజుల్లో తక్కువ మార్కులు సాధించడం ద్వారా వార్తల్లో నిలవడం చాలా రేర్ గా జరుగుతుంది.
అయితే ఒక విద్యార్థి మాత్రం పదో తరగతిలో టాపర్ కాగా ఇంటర్ లో కేవలం 13 మార్కులు సాధించి వార్తల్లో నిలిచారు.నిర్మల్ జిల్లాకు( Nirmal ) చెందిన ఈ విద్యార్థి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి.ఒక విద్యార్థి ఇంటర్ లో ఎంపీసీ గ్రూప్( MPC Group ) తీసుకుని కేవలం 13 మార్కులు సాధించాడు.ఇంగ్లీష్ లో 8 మార్కులు, తెలుగులో 2 మార్కులు, మ్యాథ్స్ పేపర్1 లో ఒక మార్క్, ఫిజిక్స్ లో ఒక మార్క్ సాధించిన ఈ విద్యార్థి మ్యాథ్స్ పేపర్ 1బీ, కెమిస్ట్రీలో మాత్రం సున్నా మార్కులు సాధించడం గమనార్హం.అన్ని సబ్జెక్ట్ లలో ఫెయిలైన ఈ విద్యార్థి మార్కులను చూసి కుటుంబ సభ్యులు సైతం షాకయ్యారట.

అయితే ఇంటర్ పరీక్షల్లో తనకు తక్కువ మార్కులు వస్తాయని ముందే ఊహించిన ఈ విద్యార్థి తనకు తక్కువ మార్కులు రావడం గురించి స్పందిస్తూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.470 మార్కులకు 13 మార్కులు సాధించిన ఈ విద్యార్థి సప్లిమెంటరీ పరీక్షలలో( supplementary examinations ) మాత్రం తాను కచ్చితంగా పాస్ అవుతానని చెప్పినట్టు బోగట్టా.లైఫ్ అంటే మార్కులు కాదని ఈ విద్యార్థి చెప్పడం గమనార్హం.పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా ఏ మాత్రం నిరాశ చెందకుండా ధైర్యంగా ఈ విద్యార్థి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సప్లిమెంటరీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో చెప్పిన ఈ విద్యార్థి ఆ పరీక్షలలో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాలి.







