తెలంగాణకు మరో భారీ పరిశ్రమ వచ్చింది.హైదరాబాద్ నగర శివారులో నిర్మిస్తున్న ఫాక్స్ కాన్ కంపెనీకి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి భూమిపూజ చేయనున్నారు.తైవాన్ కు చెందిన సంస్థ రూ.1656 కోట్ల పెట్టుబడితో ఫాక్స్ కాన్ కంపెనీ అవతరించనుంది.కొంగరకలాన్ దగ్గర సుమారు 196 ఎకరాల్లో ఈ పరిశ్రమ ఏర్పాటుకానుంది.ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్ల తయారీ యూనిట్ ద్వారా ఏర్పాటు అవుతున్న ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా 35 వేల మందికి ఉపాధి లభించనుంది.







