వైరల్: పొట్ట తగ్గించుకోడానికి అంత కష్టపడాలా? ఇలా చేస్తే సరిపాయె!

మనిషికి ఒంపు సోంపు బాగున్నంతవరకు పర్వాలేదు గానీ, ఒక్కసారి శారీరక మార్పులు వచ్చాయంటే ఆ బాధ బయటకి చెప్పుకోవడం కష్టం.అప్పటి వరకు సరిపోయిన బట్టలు ఒక్కసారిగా టైట్ అయిపోతాయి.

 Viral: Should It Be So Hard To Lose Belly Fat It Is Enough To Do This! Weight L-TeluguStop.com

పొట్ట( Belly fat ) గానీ బయటకి తన్నిందంటే చాలామంది మానసికంగా కుంగిపోతుంటారు.ఇక పెళ్లికాని ప్రసాదులైతే వారి బాధను తీర్చడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు.

వారి పొట్టలను చూసిన కన్యలు అంకుల్స్ అంటూ రిజక్ట్ చేస్తుంటారు.ఇక చేసేదేముంది, జిమ్ములకెళ్లి కుస్తీలు పడుతుంటారు మగమహారాజులు.

అయితే, ఈ సమస్యలు అనేవి అమ్మాయిలకు ఉంటాయి లెండి.ఇప్పుడు చాలా మంది పొట్ట తగ్గించుకోడానికి పడరాని పాట్లు పడుతున్నారు.పొట్ట దగ్గర కొవ్వు తగ్గించుకోడానికి జిమ్‌లలో రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చెబుతుంటారు.ఈ విషయంలో చాలామంది చాలా స్ట్రిక్ట్‌గా డైట్ పాటిస్తారు.పొట్ట రావడం అనేది ఇపుడు సాధారణ సమస్యగా మారడంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని చూసిన కొందరు కొత్త కొత్త డ్రింక్స్‌, ఫుడ్స్ మార్కెట్లోకి ప్రవేశపెడుతూ బాగానే యాపారం చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఓ వీడియో చాలా ఫన్నీగా సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ అవుతోంది.అవును, పొట్ట తగ్గించుకోడానికి ఆ మెథడ్స్ అన్నింటితో పాటు మరో ఎక్సర్‌సైజ్‌నీ కనిపెట్టాడో జిమ్‌ ట్రైనర్.రొట్టెలు చేసుకున్న కర్రను పొట్టపై రుద్దితే పొట్ట తగ్గిపోతుందని చెప్పాడు.

ఇంకేముంది కట్ చేస్తే ట్రైనింగ్ సెంటర్‌కి వచ్చే ఆడవాళ్లు, మగవాళ్ళు తలా ఓ రొట్టెల కర్ర తెచ్చుకున్నారు.అందరూ వరుసలో నిలబడి డ్యాన్స్( Dance ) చేస్తూ పొట్టపై రొట్టెల క్రరతో రుద్దుకున్నారు.

ఓ వైపు నవ్వుకుంటూనే సదరు ఎక్సర్‌సైజ్ చేసేస్తున్నారు చూడండి.ఈ వీడియోని ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేయగా కాసేపటికే వైరల్ అయిపోయింది.

పొట్ట ఇలా కూడా తగ్గించుకోవచ్చా అని నెటిజన్లు నోళ్లు వెళ్ళబెట్టి మరీ ఆ వీడియోని చూసేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube