వైరల్: పొట్ట తగ్గించుకోడానికి అంత కష్టపడాలా? ఇలా చేస్తే సరిపాయె!
TeluguStop.com
మనిషికి ఒంపు సోంపు బాగున్నంతవరకు పర్వాలేదు గానీ, ఒక్కసారి శారీరక మార్పులు వచ్చాయంటే ఆ బాధ బయటకి చెప్పుకోవడం కష్టం.
అప్పటి వరకు సరిపోయిన బట్టలు ఒక్కసారిగా టైట్ అయిపోతాయి.పొట్ట( Belly Fat ) గానీ బయటకి తన్నిందంటే చాలామంది మానసికంగా కుంగిపోతుంటారు.
ఇక పెళ్లికాని ప్రసాదులైతే వారి బాధను తీర్చడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు.
వారి పొట్టలను చూసిన కన్యలు అంకుల్స్ అంటూ రిజక్ట్ చేస్తుంటారు.ఇక చేసేదేముంది, జిమ్ములకెళ్లి కుస్తీలు పడుతుంటారు మగమహారాజులు.
"""/" /
అయితే, ఈ సమస్యలు అనేవి అమ్మాయిలకు ఉంటాయి లెండి.ఇప్పుడు చాలా మంది పొట్ట తగ్గించుకోడానికి పడరాని పాట్లు పడుతున్నారు.
పొట్ట దగ్గర కొవ్వు తగ్గించుకోడానికి జిమ్‌లలో రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చెబుతుంటారు.ఈ విషయంలో చాలామంది చాలా స్ట్రిక్ట్‌గా డైట్ పాటిస్తారు.
పొట్ట రావడం అనేది ఇపుడు సాధారణ సమస్యగా మారడంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని చూసిన కొందరు కొత్త కొత్త డ్రింక్స్, ఫుడ్స్ మార్కెట్లోకి ప్రవేశపెడుతూ బాగానే యాపారం చేసుకుంటున్నారు.
"""/" /
ఈ క్రమంలోనే ఓ వీడియో చాలా ఫన్నీగా సోషల్ మీడియా( Social Media )లో తెగ వైరల్ అవుతోంది.
అవును, పొట్ట తగ్గించుకోడానికి ఆ మెథడ్స్ అన్నింటితో పాటు మరో ఎక్సర్‌సైజ్‌నీ కనిపెట్టాడో జిమ్ ట్రైనర్.
రొట్టెలు చేసుకున్న కర్రను పొట్టపై రుద్దితే పొట్ట తగ్గిపోతుందని చెప్పాడు.ఇంకేముంది కట్ చేస్తే ట్రైనింగ్ సెంటర్‌కి వచ్చే ఆడవాళ్లు, మగవాళ్ళు తలా ఓ రొట్టెల కర్ర తెచ్చుకున్నారు.
అందరూ వరుసలో నిలబడి డ్యాన్స్( Dance ) చేస్తూ పొట్టపై రొట్టెల క్రరతో రుద్దుకున్నారు.
ఓ వైపు నవ్వుకుంటూనే సదరు ఎక్సర్‌సైజ్ చేసేస్తున్నారు చూడండి.ఈ వీడియోని ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేయగా కాసేపటికే వైరల్ అయిపోయింది.
పొట్ట ఇలా కూడా తగ్గించుకోవచ్చా అని నెటిజన్లు నోళ్లు వెళ్ళబెట్టి మరీ ఆ వీడియోని చూసేస్తున్నారు.
స్టార్ హీరో అక్కినేని నాగార్జున మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే.. ఏం జరిగిందంటే?