వాట్సప్ నుండి +60, +84, +62 నెంబర్లతో మిస్డ్ కాల్స్ వస్తున్నాయా? కారణం ఇదే!

గత కొన్ని రోజులుగా వాట్సప్( Whatsapp ) గురించిన ఓ విషయం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసిన విషయం అందరికీ తెలిసినదే.చాలామంది వాట్సప్ యూజర్లకు ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి మిస్డ్ వాయిస్ కాల్స్ ఎక్కువగా రావడం ఈ వార్తలకు ఆజ్యం పోసింది.

 Missed Calls Coming From Whatsapp With +60, +84, +62 Numbers This Is The Reason,-TeluguStop.com

ఒక నెంబర్ కాకపోతే మరో నెంబర్ నుంచి ఈ మిస్డ్ కాల్స్ వస్తూనే ఉండడం వలన చాలామంది యూజర్లు ఒకింత అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసినదే.కాగా ఇది వాట్సప్‌లో కొత్త స్కామ్ అని తెగ ప్రచారం జరుగుతోంది.

Telugu International, Latest, Scam, Spam, Tech, Whatsapp-Latest News - Telugu

దాంతో వాట్సప్ యూజర్లు అలెర్ట్ అవుతున్నారు.అయితే ఈ వాట్సప్ కాల్స్( WhatsApp calls ) వెనుక ఎలాంటి స్కామ్ లేదని తాజాగా వార్తలొస్తున్నాయి.అలాంటప్పుడు ఈ మిస్డ్ కాల్స్ ఎందుకొస్తున్నాయని డౌట్ రావొచ్చు.అది తెలుసుకునేందుకే సైబర్ సెక్యూరిటీ నిపుణులు దర్యాప్తు జరపగా ఈ దర్యాప్తులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

వాట్సప్ యూజర్లకు మే 1 నుంచి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి.

Telugu International, Latest, Scam, Spam, Tech, Whatsapp-Latest News - Telugu

డేటా ఒకసారి పరిశీలిస్తే, మలేషియా ( Malaysia )(+60), ఇథియోపియా( Ethiopia ) (+251), వియత్నాం (+84), కెన్యా (+254), ఇండోనేషియా (+62) దేశాల నుంచి వాట్సప్ యూజర్లకు మిస్డ్ కాల్స్ వస్తున్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణుల దర్యాప్తులో తేలింది.అసలు ఈ కాల్స్ ఎందుకు వస్తున్నాయని డి ఎన్ ఏ ఓ కథనం పబ్లిష్ చేసింది.ఇవి స్కామ్ కాల్స్ కాదు అని, స్పామ్ కాల్స్ అని ఆ కథనంలో డి ఎన్ ఏ పబ్లిష్ చేసింది.

భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ నిపుణుల్లో ఒకరు, భారత ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్ మెంబర్ అయిన అమిత్ దూబే ఈ వాట్సప్ కాల్స్ గురించి డి ఎన్ ఏ కి దీనిగురించి చెప్పడం జరిగింది.అయితే ఈ విషయంపైన ఇంకా పూర్తి వివరాలు అనేవి ప్రకటించాల్సిన అవసరం ఉందని కొంతమంది వాట్సాప్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube