ఘనంగా ఎంపీతో పరిణితి నిశ్చితార్థం... వైరల్ అవుతున్న ఫోటోలు!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పరిణితి చోప్రా(Parineeti Chopra) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.ఈ క్రమంలోనే ఈమె తన నిశ్చితార్థాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

 Parineeti Chopra Raghav Chadha Engagement Pics Viral Details, Parineeti Chopra,a-TeluguStop.com

ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) లీడర్ రాఘవ్ చడ్ఢా(Raghav Chadha) తో ఈమె నిశ్చితార్థం ( Engagement) శనివారం సాయంత్రం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.ఈ క్రమంలోనే వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శనివారం నాడు రాత్రి దిల్లీలోని రాఘవ్ స్వగృహంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకోవడంతో నిశ్చితార్థం పూర్తయింది.

Telugu Aam Aadmi, Aapmp, Parineetichopra, Raghav Chadha-Movie

ఈ నిశ్చితార్థ వేడుకలలో ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, సన్నిహితులు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు.ఇక నిశ్చితార్థపు ఫోటోలను పరిణితి చోప్రా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అవును అని చెప్పడానికి అన్నింటినీ ప్రార్థించానని రాసుకొచ్చారు.వీరి ఎంగేజ్మెంట్ సంప్రదాయ సిక్ పద్ధతిలో జరిగినట్లు తెలుస్తోంది.

ఇక గత కొద్దిరోజులుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.మార్చి నెలలో పరిణీతి-రాఘవ్ లంచ్ డేట్‌లో కలిసిన తర్వాత డేటింగ్ రూమర్లు మొదలయ్యాయి.

Telugu Aam Aadmi, Aapmp, Parineetichopra, Raghav Chadha-Movie

ఈ విధంగా వీరిద్దరూ పలుమార్లు కెమెరా కంటికి చిక్కడంతో అందరూ వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని భావించారు.ఇలా వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న వీరు మాత్రం వీరి రిలేషన్ పై అసలు నోరు విప్పలేదు.అయితే తాజాగా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.బీటౌన్ నివేదికల ప్రకారం పరిణితీ-రాఘవ్ ఇద్దరూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌(London School Of Economic)లో కలిసి చదువుకున్నారు.

అప్పటి నుంచే చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నారు. రాఘవ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీగా కొనసాగుతున్నారు.ఇక ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అయితే పెళ్లికి సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియచేయునున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube