నేను వచ్చి నీ కాళ్లు పట్టుకోవాలా అని వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్.. నీకుంటుంది అన్నాడంటూ?

జూనియర్ ఎన్టీఆర్ కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఏకైక సినిమా రాఖీ ( Rakhi Movie ) కాగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అబవ్ యావరేజ్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు( NTR ) ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

 Actor Ravi Varma Comments About Junior Ntr Details, Actor Ravi Varma , Junior Nt-TeluguStop.com

ఇలియానా, ఛార్మి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా వాళ్లిద్దరి నటనకు సైతం మంచి మార్కులు పడ్డాయి.రాఖీ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తన నటనతో రవివర్మ ( Ravi Varma ) మెప్పించారు.

ఈ నటుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నారా రోహిత్ తో కలిసి మూడు సినిమాలలో నటించానని అయన తెలిపారు.నారా రోహిత్ చాలా ప్రోత్సహిస్తారని ఆయన పేర్కొన్నారు.

ఆ సినిమాలో నాకు బీజీఎం స్పెషల్ గా ఉండేలా నారా రోహిత్ కేర్ తీసుకున్నారని రవివర్మ అన్నారు.జూనియర్ ఎన్టీఆర్ ప్రజంటేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఏందీ.నువ్వు చేస్తావా చెయ్ అనేలా ఉంటుందని రవివర్మ చెప్పుకొచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి యాక్ట్ చేస్తే మజా వస్తుందని రవివర్మ తెలిపారు.ఎన్టీఆర్ గారిలో ఒక సౌండింగ్ ఉంటుందని ఆయన అన్నారు.రాఖీ సినిమాలోని ఒక సీన్ కోసం నేను వచ్చి నీ కాళ్లు పట్టుకోవాలా.? నీకుంటుంది అని ఎన్టీఆర్ అన్నారని రవి వర్మ పేర్కొన్నారు.ఆ సీన్ తీసేయండని అవసరమైతే మీ కాళ్లు పట్టుకుంటానని నేను చెప్పానని రవివర్మ వెల్లడించారు.

మహేష్ గారు వెన్నెల మూవీ చూసి ఆ సినిమాలో నా రోల్ గురించి కామెంట్లు చేశారని ఆయన తెలిపారు.ఒకేరోజు మూడు సినిమాల షూటింగ్ లలో పాల్గొన్నానని ఆయన పేర్కొన్నారు.రవివర్మ ఇప్పటికీ వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.రవివర్మను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.కెరీర్ విషయంలో రవివర్మ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube