ఉత్తర భారత దేశంలోనూ ఈశాన్య రాష్ట్రాలలోనూ తన పట్టును నిలుపుకుంటున్న భారతీయ జనతా పార్టీకి( BJP ) దక్షిణ భారత రాజకీయాలు ఒక పట్టాన కోరుకున పడటం లేదు.సహజంగా మతం ఆధారిత రాజకీయాలు చేసే భారతీయ జనతా పార్టీకి దక్షిణాదిన కర్ణాటకలో మరెక్కడా తగిన ఆదరణ లభించలేదు.
తెలంగాణలో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్నప్పటికీ అది పేపర్ పై తప్ప రియాలిటీలో కనిపించడం లేదని చెప్పవచ్చు.పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలు కూడా తెలంగాణలో ఆ పార్టీకి లేరు.
ఢిల్లీ బలాన్ని ఇక్కడ చూపించుకొని కేసీఆర్ కి( KCR ) మేమే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్నారు తప్ప తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కొనేది కాంగ్రెస్ మాత్రమేనని విశ్లేషణలు వస్తున్నాయి.రామ జన్మభూమి ఉద్యమం తర్వాత దేశవ్యాప్తంగా బలపడిన భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో( Karnataka ) క్రమంగా బలపడుతూ వచ్చింది .

40 అసెంబ్లీ సీట్లతో మొదలుపెట్టి ప్రతి ఎన్నికకు ఆ సంఖ్యను పెంచుకుంటూ వెళ్లి గత ఎన్నికలలో 104 స్థానాలను సాధించి అధికారం దగ్గరగా వచ్చింది … అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా భాజాపాను కాదని కాంగ్రెస్ జెడిఎస్ లు జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో రగిలిపోయిన భాజపా వ్యూహాత్మకంగా ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి తాను అధికారంలోకి వచ్చింది .అయితే అభివృద్ధి ద్వారా ప్రజల మనసులను గెలుచుకొని మరొకసారి అధికారంలోకి రావడానికి ఆలోచించకుండా ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి మెజారిటీ హిందువులను తమ వైపు తిప్పుకోవాలని చూసిందని భాజపాపై చాలా విమర్శశలు వచ్చాయి .ముఖ్యంగా ముస్లిం విద్యార్థినిలను హిజాబ్ వేసుకోకుండా నిషేధించడం …

హిందూ పండుగలకు ముస్లింల మాంసం దుకాణాలు మూసివేపించడం ఇలా ప్రజలను మతాల వారీగా విభజన చేస్తున్నారని అనవసరమైన విభేదాలను రెచ్చగొడుతున్నారని విమర్శలు వచ్చాయి.వీటిపై చర్య తీసుకుపోగా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు కూడా వారికి మద్దతు ఇచ్చేలా మాట్లాడటం కర్ణాటక వాసులకు ఆగ్రహం తెప్పించినట్లుగా ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.ఏది ఏమైనప్పటికీ కర్ణాటకలో ఉన్న బలంతో దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలను కూడా హస్తగతం చేసుకుందామని ప్రయత్నించిన భాజపాకు ఇప్పుడు చేతిలో ఉన్న కర్ణాటక కూడా జారిపోవడంతో మొత్తం దక్షిణాది లో ఒక రాష్ట్రంలో కూడా అధికారం లో లేని పరిస్థితిని ప్రస్తుతం భాజపా ఎదుర్కొంటుంది….దక్షిణాది ఓటర్లు ఆకట్టుకోవటం అంత సులువు కాదని భాజపాలు అంతర్మదనం జరుగుతుందని సమాచారం
.






