విరాట్ కోహ్లీ( Virat Kohli ) అంటే కేవలం స్టార్ బ్యాటర్ మాత్రమే కాదు.కెప్టెన్ గా కూడా ఎన్నో సరికొత్త రికార్డులు సృష్టించాడు.
కెప్టెన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇకా తన కెప్టెన్సీలో భారత జట్టు టెస్టుల్లో చాలా కాలం నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ఒక్క ఐసీసీ ట్రోపీ( ICC Trophy ) లేదనే వెలితి తప్ప.కోహ్లీ కెప్టెన్ గా తనదైన ముద్ర వేసుకున్నాడు.
విరాట్ కోహ్లీ సారధ్యంలో భారత జట్టు 68 టెస్టులలో 39 మ్యాచులు గెలిచింది.కేవలం 16 టెస్ట్ మ్యాచ్ లలో ఓడింది.95 వన్డే మ్యాచ్లలో 65 మ్యాచ్లలో కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు విజయం సాధించింది.30 వన్డే మ్యాచ్ లలో ఓడింది.అయితే విరాట్ కోహ్లీ తాజాగా తన కెప్టెన్సీ పై షాకింగ్ విషయాలు చెప్పడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మహేంద్రసింగ్ ధోని( Mahendra Singh Dhoni ) మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీగా 2016లో వైదొలిగాడు.అనంతరం విరాట్ కోహ్లీ భారత జట్టు కెప్టెన్ గా ఆరు సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తించాడు.తన కెప్టెన్సీ కాలంలో ఎన్నో రికార్డులు సృష్టించాడు.2017లో కోహ్లీ కెప్టెన్సీలో ఛాంపియన్ ట్రోఫీ, 2019లో వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్, 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఓడిన సంగతి తెలిసిందే.
2021 లో కోహ్లీ కెప్టెన్సీ( Kohli Captaincy )లో టీ20 ప్రపంచ కప్ ఆడిన భారత జట్టు కనీసం గ్రూప్ దశ కూడా దాటకపోవడంతో టీ20 ( T20 ) కెప్టెన్సీకి కోహ్లీ రాజీనామా చేశాడు.తర్వాత కోహ్లీ అనుమతి లేకుండానే బీసీసీఐ భారత జట్టు కెప్టెన్సీ పదవి నుండి కోహ్లీని తొలగించడంతో.టెస్టు కెప్టెన్సీ నుండి కోహ్లీ రాజీనామా చేశాడు.

కోహ్లీ తన కెప్టెన్సీ పై మాట్లాడుతూ.కెప్టెన్ గా తాను కొన్ని తప్పులు చేశానని తెలిపాడు.అయితే తన స్వార్థం కోసమో.వ్యక్తిగత రికార్డుల కోసం ఎలాంటి తప్పులు చేయలేదని తెలిపాడు. భారత జట్టు( Indian Cricket Team ) గెలవడం కోసమే నిర్ణయాలు తీసుకున్నానని, మనం అనుకున్నవన్నీ జరగవు కదా అని తెలిపాడు.తన దృష్టిలో బ్యాటర్ తప్పు చేస్తే అవుట్ అయినట్టు, కెప్టన్ తప్పు చేస్తే ఫెయిల్ అయినట్టు అని తెలిపాడు.
గెలుపు-ఓటములు సహజం కాబట్టి గెలవాలి అనే తపనను మాత్రం ఎప్పుడూ తాను కోల్పోలేదని, ఎప్పుడు విజయాల కోసమే ప్రయత్నించే వాడినని తెలిపాడు.అయితే తాను మంచి ఉద్దేశంతోనే తీసుకున్న నిర్ణయాలు కొందరికి నచ్చేవి కాదని తెలుపుతూ.
తన సక్సెస్ తో పాటు తన ఫెయిల్యూర్స్ ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని షాకింగ్ విషయాలు చెప్పాడు.







