గోరు చిక్కుడు సాగులో అధిక దిగుబడి కోసం సస్యరక్షక చర్యలు..!

వేసవిలో ఎక్కువగా రైతులు కూరగాయ పంటలను సాగు చేస్తుంటారు.గోరు చిక్కుడు( Guar ) సాగు చేసేందుకు వేసవికాలం చాలా అనుకూలంగా ఉంటుంది.

 Plant Protection Measures For High Yield In Guar Legume Cultivation..!, Rhizo-TeluguStop.com

ఇక ఉప్పు, చౌడు నేలలు తప్ప మిగిలిన అన్ని రకాల నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి.నేలను నాలుగైదు సార్లు బాగా దున్నుకోవాలి.

గోరుచిక్కుడు విత్తనాలకు రైజోబియం కల్చర్( Rhizobium culture ) పట్టిస్తే వేర్ల వద్ద బుడిపెలు ఏర్పడి నత్రజని స్థిరీకరణ చెందుతుంది.కాబట్టి ఎత్తుకునే ముందు రైజోబియం కల్చర్ పట్టించి కాసేపు నీడలో ఆరబెట్టుకుని విత్తనాలను పొలంలో నాటుకోవాలి.

పొలంలో సాల్ల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా విత్తు కోవాలి.ఇక మొక్కల మధ్య దూరం 10 సెంటీమీటర్లు ఉండేలాగా పల్చగా పెట్టుకోవాలి.భూమిలో తేమ శాతాన్ని బట్టి పది రోజుల వ్యవధిలో ఒకసారి నీటి తడులు అందించాలి.పంట వేసిన 20 రోజులకు, 60 రోజులకు,75 రోజులకు నీటి తడులు అందించడం చాలా ముఖ్యం.</br

Telugu Acephate, Agriculture, Cattle Manure, Formers, Guar, Yield, Rhizobium-Lat

విత్తిన నెలరోజుల లోపు కలుపు తీయాలి.కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగితే దిగుబడి తగ్గుతుంది.అవసరం అయితే 45 రోజుల లోపు మరోసారి కలుపు తీయించాలి.కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉంటే పెండిమితాలిన్ 400గ్రా.ను 200లీ ఇటిలో కలిపి ఎకరం పొలానికి పిచికారి చేయాలి.</br

Telugu Acephate, Agriculture, Cattle Manure, Formers, Guar, Yield, Rhizobium-Lat

చిక్కుడు పంటకు చీడపీడల బెడద కాస్త తక్కువగానే ఉంటుంది.కానీ పెనుబంక పురుగులు ఆశించే అవకాశం ఉంది.లీటరు నీటిలో ఎసిఫేట్( Acephate ) 1.5 గ్రాములు కలిపి పిచికారి చేయాలి.ఇక ఎరువుల విషయానికి వస్తే రసాయనిక ఎరుగులకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చి పశువుల ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

వేసవిలో ఆఖరి దుక్కిలో ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువు వేయాలి.లేదంటే ఒక టన్ను వర్మి కంపోస్ట్ ఎరువులు వేసిన సరిపోతుంది.నేలలో నత్రజని, భాస్వరం తక్కువగా ఉంటే ఎకరాకు 8 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube