తల, మెడ క్యాన్సర్ పేషెంట్లకు శుభవార్త... న్యూ రేడియేషన్ థెరపీ వచ్చేసింది!

నేడు కాన్సర్ వ్యాధి( Cancer disease ) ఎంతగా ప్రబలిందో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు అరుదుగా వచ్చే ఈ వ్యాధి నేడు పట్టణాలనుండి పల్లెల వరకూ ఇపుడు చాలా కామన్ గా వచ్చే వ్యాధి అయిపోయింది.

 Good News For Head And Neck Cancer Patients New Radiation Therapy Has Arrived, G-TeluguStop.com

ఇక కాన్సర్ పేషెంట్లకు సాధారణంగా ఇచ్చే రేడియేషన్ థెరపీల గురించి మీరు వినే వుంటారు.ఈ థెరపీ అనేది ప్రస్తుతం అంతటా అందుబాటులో ఉన్నప్పటికీ, తల, మెడ వంటి సున్నితమైన ప్రాంతాల్లో దాని పనితీరు అంత సమర్థవంతంగా ఉండేది కాదు.

కానీ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్త రేడియేషన్ థెరపీ( radiation therapy ) ఐఎంఆర్‌టీతో ఆ పరిస్థితి ఉండదని వైద్యలు చెబుతున్నారు.

అవును, తల, మెడ, గొంతు భాగంలోని అతిచిన్న క్యాన్సర్ కణాలను కూడా ఈ అధునాతన ఐఎంఆర్‌టీ రేడియేషన్( IMRT radiation ) కిరణాల ప్రయోగం ద్వారా సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయవచ్చని నిపుణులు చెప్తున్నారు.కొన్ని రకాల క్యాన్సర్లు సాధారణంగా నోరు, గొంతు లేదా వాయిస్ బాక్స్‌లో ప్రారంభమవుతాయి.భారతదేశంలో అయితే ఇవి 2వ అత్యంత సాధారణ క్యాన్సర్లుగా ఇపుడు మారిపోయాయి.

పెదవులు, నోటి కుహరం క్యాన్సర్లు కూడా ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి.

ఇక ఈ కొత్త రేడియేషన్ థెరపీ అనేది శరీరంలో క్యాన్సర్ కణాలు ఎక్కడున్నా కచ్చితంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు నమ్ముతున్నారు.అంతేగాక, ఈ థెరపీ బాడీలోని ఇతర ఆరోగ్యకరమైన అవయవాలు, కణజాలాలను కాపాడుతూ క్యాన్సర్ కణాలను మాత్రమే చంపడానికి లేదా వాటి సంఖ్యను తగ్గించడానికి సహాయపడుతుంది.పైగా ఇది ఔట్ పేషెంట్ ట్రీట్‌మెంట్‌ విధానంలో తక్కువ ఖర్చుతో, అత్యంత తక్కువ సమయంలో ప్రయోజనం పొందగలిగే చికిత్స అని చెబుతున్నారు వైద్య నిపుణులు.

కాబట్టి ఈ థెరపీ తల, మెడ క్యాన్సర్ పేషెంట్లకు ఓ వరమనే చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube