అక్కినేని హీరోలు( Akkineni heroes ) ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు నిర్మాతలకు భారీ షాకిస్తున్న సంగతి తెలిసిందే.బంగార్రాజు( Bangarraju ) సినిమా తర్వాత అక్కినేని హీరోలు నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు.
అక్కినేని ఫ్యామిలీని దరిద్రం వెంటాడుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కస్టడీ సినిమా( Custody movie ) కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేదు.
కస్టడీ సినిమాలో కథ, కథనం ఏ మాత్రం కొత్తగా లేదు.వెంకట్ ప్రభు ( Venkat Prabhu )ఈ సినిమాలో చూసిన సన్నివేశాలనే మళ్లీ చూపించారని కామెంట్లు వినిపించడం గమనార్హం.
అరవిందస్వామి ఎంట్రీ, ఇంటర్వెల్ సీన్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.కస్టడీ టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను మిగల్చడం గ్యారంటి అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

కథ, కథనం విషయంలో అక్కినేని ఫ్యామిలీ మళ్లీ పొరపాటు చేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.తమిళ నేటివిటీకి దగ్గరగా ఈ సినిమా తెరకెక్కిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సినిమా రిజల్ట్ వల్ల నాగచైతన్య( Naga Chaitanya ) ఖాతాలో మరో భారీ డిజాస్టర్ చేరిందనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అయితే అక్కినేని ఫ్యాన్స్ కు మాత్రం ఈ మూవీ కొంతమేర నచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

కస్టడీ మూవీకి మ్యూజిక్, బీజీఎం మైనస్ అయ్యాయి.నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ ప్లేతో మానాడును తెరకెక్కించిన వెంకట్ ప్రభు ఈ సినిమాతో ప్రేక్షకులకు షాకిచ్చారు.కొన్ని పాత్రలతో ఈ సినిమాలో చేయించిన కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు.అక్కినేని హీరోలు కెరీర్ పరంగా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.
అక్కినేని హీరోలకు టైమ్ అస్సలు బాలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.







