పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )ఒక వైపు రాజకీయం మరోవైపు సినిమాలు రెండింటిని బాగానే మేనేజ్ చేస్తున్నారు.ఈ మధ్యే ఏపీ రాజకీయాల్లో జగన్ కి సైతం చుక్కలు పట్టేలా జనల మధ్యే తిరుగుతూ జననాయకుడనిపించుకుంటున్నాడు.
అయితే సినిమాల్లో ఆయనకున్న పవర్ క్రేజ్ ఏ హీరోకు లేదని చెప్పాలి.బయటె కాదు.
సినీ ఇండస్ట్రీలోనే ఆయనకు ఫాన్స్ ఉన్నారంటే ఆయన రేంజ్ ఎంటో అర్థం చేసుకోవచ్చు… రాజకీయాల్లోకి వెళ్లి ఆ తరువాత అభిమానుల కోసమే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.పవన్ రీఎంట్రీతో అభిమానుల్లో డబల్ జోష్ నింపినట్లైంది .అసలు విషయానికి వెళ్తే ఎన్నికల సమయం దగ్గర పడతున్న టైమ్‌లో పవన్ చేతిలో నాలుగు పెద్ద సినిమాలు ఉన్నాయి.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఈ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు.ఎందుకంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రాజెక్టులు ఒకే టైమ్‌లో నడుస్తున్నాయి.అయితే పవన్ కళ్యాణ్ పలు సినిమాలకు కమిట్ ఇస్తే ఎలా ఉంటుందో అందరికి తెల్సిందే.
అందుకే కమిట్ అయిన అన్ని సినిమాలకు కూడా సమ న్యాయం అన్నట్లుగా సాధ్యం అయినంత వరకు ఎక్కువ డేట్లు అన్ని సినిమాలకు ఇస్తున్నాడు.ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ ఓ నిర్ణయం తీసుకున్నారట.
ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న ఈ ప్రాజెక్టులన్నీ వచ్చే 6 నెలల లోపు కంప్లీట్ చేయలనుకుంటున్నారని తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్‌గా మారేందుకు పవన్ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు.
ఎన్నికల సమయము అసఞ్ఞమవుతుండటంతో పవన్ ఇక నిత్యం జనాల్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ కారణంగానే వచ్చే ఆరు నెలల్లో హరి హర వీర మల్లు( Hari Hara Veera Mallu ), ఉస్తాద్, ఓజీ, పీకేఎస్‌డీటీ సినిమాలను పూర్తి చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు .

రాబోయే నెలల్లో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి , జనసేన కార్యకలాపాలకు తగినంత సమయం కేటాయించాలని అనుకుంటున్నారట.ఆ తరువాత వారాహి యాత్ర తో రాజకీయ దండ యాత్ర మొదలు పెట్టబోతున్నారని దానికోసమే గ్రౌండ్ వర్క్ ప్రిఫేర్ చేసుకుఅంటున్నారని తెలుస్తుంది.జనసేనాని స్పీడ్ చూస్తుంటే సినిమాల ఈ డెడ్‌లైన్‌లోగా ప్రాజెక్టులన్నీ పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇవి పూర్తి కాగానే ఏపీకి వెళ్లి అక్కడి ఎన్నికల ప్రచార కార్యక్రమాలను భుజాన వేసుకోబోతున్నారు.
ఇక స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కాంబోలో( Harish Shankar ) దాదాపుగా 11 ఏళ్ళ తరువాత తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
తాజాగా మే 11న ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా పవర్‌స్టార్ మేనియా, క్రేజ్‌తో ఇప్పటికే ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.గ్లింప్స్‌ను చూస్తుంటే.
మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమా తీస్తున్నట్లు తెలుస్తుంది.పవన్ తనదైన మాస్ లుక్‌తో కనిపించి ఫాన్స్ ని తెగ మెప్పించారని చెప్పక తప్పదు.మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీలోని ఎస్‌ఐగా ఈసారి పవన్ కనిపించబోతున్నారని వీడియో చూస్తే తెలుస్తోంది.ఇక గ్లింప్స్ చివరల్లో డైలాగ్ ఫాన్స్ లో మరింత జోష్ నింపింది…
.







