ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయిన వారిలో ఒకరు కృష్ణం రాజు.స్వతహాగా ఆయన కుటుంబం రాజుల కుటుంబం అయినా, గొప్ప ఆస్తిపరుడు అయినా కూడా సినిమాలు అంటే అతనికి పిచ్చి ఉండేది.
ఆ పిచ్చి తోనే ఆయన మొగళ్తూరు నుండి చెన్నై కి వచ్చాడు, అప్పట్లో ఆయన అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసాడు, స్టూడియోల చుట్టూ తిరిగేవాడు.తన తండ్రిని అడిగితే అతనికి ఉన్న పలుకుబడితో వెంటనే కృష్ణం రాజు కి సినిమాల్లో అవకాశాలు ఇప్పించేవాడు.
కానీ కృష్ణం రాజు( Krishnam Raju ) తండ్రి సహాయం కోరలేదు, తన సొంత కాళ్ళ మీద నిలబడాలి అనుకున్నాడు, తన సొంత కష్టం తోనే ఇండస్ట్రీ కి వచ్చాడు.తొలిసినిమా లో హీరో గా చేసినప్పటికీ పెద్దగా అచ్చిరాలేదు.
ఆ తర్వాత ఆయనకీ వరుసగా విలన్ రోల్స్ వచ్చాయి, చూస్తూ ఉండగానే టాలీవుడ్ లో పెద్ద విలన్ గా మారిపోయాడు.

అలా కృష్ణం రాజు అక్కినేని నాగేశ్వర రావు హీరో గా నటించిన ‘మంచి రోజులు వచ్చాయి( Manchi Rojulu Vachayi )’ అనే సినిమాలో విలన్ గా నటించాడు.ఇందులో నాగేశ్వర రావు కి చెల్లెలుగా గీతాంజలి రామకృష్ణ ( Geethanjali Ramakrishna )నటించింది.కొన్ని సంవత్సరాల క్రితం ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో కృష్ణం రాజు విలనిజం ఏ రేంజ్ లో ఉండేదో చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘అప్పట్లో నేను మంచి రోజులు వచ్చాయి’ అనే సినిమా చేశాను,ఇందులో నాది అక్కినేని నాగేశ్వర రావు గారికి చెల్లెలు పాత్ర.కృష్ణం రాజు కి మరియు నాకు మధ్య ఒక సన్నివేశం ఉంటుంది.
నేను కృష్ణం రాజు మొహం మీద ఉమ్ముతాను, దానికి ఆయన నా మీద కోపం తో ‘నా మీదనే ఉమ్మేస్తావా‘ అని అరుస్తూ నా బట్టలను చించేస్తాడు, నా జుట్టు పెరీకేస్తాడు, చివరికి నా మీదకి కుక్కని వదిలేస్తాడు,ఇలా నన్ను ఎన్నో విధాలుగా చిత్రహింసలు పెడుతాడు.ఈ సన్నివేశం చేస్తున్నప్పుడు నేను నరకం అనుభవించాను’ అంటూ చెప్పుకొచ్చింది గీతాంజలి.

ఆమె చెప్పింది మొత్తం విన్న తర్వాత ఈరోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా సన్నివేశాలు రక్తికట్టించేందుకు నిజంగా కొట్టుకునేవాల్లా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజెన్స్.సినిమా అంటే అన్నీ రకాలు చెయ్యాలి, ఎలాంటి పాత్రలు అయిన పోషించడానికి సిద్ధపడాలి.నేటి తరం హీరోలకు వాళ్లకు ఉన్న భారీ సూపర్ స్టార్ స్టేటస్ వల్ల విలన్ పాత్రలు చెయ్యడానికి భయపడుతున్నారు కానీ, అప్పట్లో చిరంజీవి , కృష్ణం రాజు వంటి వారు అప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు కాబట్టి,వాళ్ళ మీద ఎలాంటి అంచనాలు లేవు కాబట్టి ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసారు.వాటి ద్వారా ఫేమస్ అయ్యి,హీరోలుగా మారి సూపర్ స్టార్స్ అయ్యారు.
నేడు ఇండస్ట్రీ లో ఆ పరిస్థితి కనిపించకపోవడం శోచనీయం.అయితే ఒక విషయం లో టాలీవుడ్ లో పెను మార్పులు వచ్చాయి.
అదే మల్టీస్టార్ర్ర్ సినిమాలు, అప్పట్లో సరిసమానమైన ఇమేజి ఉన్న స్టార్ హీరోలు కలిసి నటించేవారు.చిరంజీవి తరం లో అది జరగలేదు, కానీ నేటి తరం లో అది జరుగుతుంది.
గత ఏడాది ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి #RRR చేసారు ,భవిష్యత్తులో కూడా ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ని చూసే అవకాశం ఉంది.







