సూర్యాపేట జిల్లా: పర్యావరణ పరిరక్షణకు అందరూ తోడ్పడాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.రాజేంద్ర కుమార్ అన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని సద్దలచెరువు ట్యాంకు బండ్ పై నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని,ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు తోడ్పాటును ఇవ్వాలన్నారు.ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని తెలియజేశారు.అనంతరం పర్యావరణ పరిరక్షణకు అందరం సహాకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి,జిల్లా యువజన మరియు క్రీడల అధికారి బి.వెంకట్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ ఏఈ బి శంకర్,పిడి మెప్మా రమేష్ నాయక్,గ్రీన్ ఫీల్డ్ ట్రస్ట్ నిర్వాహకులు నరేందర్,కిరణ్,సువన్ కంపెనీ మేనేజర్ సిహెచ్.వెంకట్ రెడ్డి,వ్యాయామ ఉపాధ్యాయులు మల్లేష్, రవి తదితరులు పాల్గొన్నారు.