పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్( Prabhas ) నటిస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్’( Adipurush ) ఒకటి.ఈ రిలీజ్ కు నెల మాత్రమే ఉండడంతో మేకర్స్ గత కొన్ని రోజుల క్రితమే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Director Om Raut ) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది.
ఈ సినిమాపై అంతా భారీ అంచనాలను పెట్టుకుని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మొదటిసారి ప్రభాస్ బాలీవుడ్ లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు.ఈ నేపథ్యంలోనే డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఇది పక్కా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు.
ఎందుకంటే ఇది హిట్ అయితే ప్రభాస్ బాలీవుడ్ లో మరింత క్రేజ్ పెంచుకునేందుకు ఆస్కారం ఉంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది.
మరి మరో నెల మాత్రమే రిలీజ్ కు సమయం ఉండడంతో ఈ సినిమాను వీలైనంత ఎక్కువుగా ప్రమోట్ చేస్తున్నారు.తాజాగా ఓం రౌత్ ప్రభాస్ తో దిగిన ఒక ఫోటో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది.

ఓం రౌత్ ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ ట్రైలర్ ను 3డి గ్లాసెస్ పెట్టుకుని వీక్షిస్తున్న పిక్ ను షేర్ చేసాడు.ఈ బ్యూటిఫుల్ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.యే దోస్తీ అంటూ 3డి లో ఆదిపురుష్ ట్రైలర్ ను నా ఫ్రెండ్ తో కలిసి చూస్తున్నా అంటూ ఈయన పిక్ ను షేర్ చేసాడు.ఈ ఫోటోను నెట్టింట షేర్ చేస్తూ ఫ్యాన్స్ వైరల్ చేసేసారు.

ఇక ఈ మైథలాజికల్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తే.కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడిగా నటిస్తున్నారు.జూన్ 16న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో.ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందో వేచి చూడాలి.







