సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు కొంత మంచి గుర్తింపు వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీల తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలి అంటూ సెలబ్రిటీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలెబ్రెటీలు పలు రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక(Rashmika) మందన్న కూడా ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు.అయితే తాజాగా ఈమె ఒక యాడ్ చేసి పెద్ద ఎత్తున వివాదంలో చిక్కు కోవడమే కాకుండా విమర్శలు పాలవుతున్నారు.

ఇటీవల మెక్‌డోనాల్డ్స్‌కు యాడ్ చేశారు.అందులో మెక్‌డోనాల్డ్స్ piri piri mcspicy చికెన్ బర్గర్(Chicken Burger) ను ప్రమోట్ చేశారు. ఏదో రుచికరమైనటువంటి ఈ బర్గర్ ను ఈమె చాలా ఆస్వాదిస్తూ తింటున్నటువంటి వీడియోని స్లోమోషన్ లో చూపిస్తూ ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేశారు.ఈ యాడ్ ట్రెండ్ అవ్వడమే కాకుండా దీనివల్ల రష్మిక విమర్శలు పాలు కూడా అవుతున్నారు.
గతంలో ఈమె తన ఆహారపు అలవాట్లు గురించి మాట్లాడుతూ తాను ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పడమే ఇందుకు కారణం.

రష్మిక ఈ బర్గర్ తిన్నటువంటి వీడియో వైరల్ కావడంతో నేటిజన్స్ ఫాన్స్ సైతం రష్మిక వెజిటేరియన్ కదా చికెన్ బర్గర్ తినడం ఏంటి అంటూ గతంలో ఈమె వెజిటేరియన్ అని చెప్పినటువంటి వీడియోని కూడా జత చేస్తూ భారీగా ట్రోల్ చేస్తున్నారు.ఫేక్ యాడ్స్‌తో.తన ఫ్యాన్స్‌నే మోసం చేస్తోందంటూ.
రష్మికను ఏకిపారేస్తున్నారు.ఏది ఏమైనా రష్మిక ఈ బర్గర్ యాడ్ వీడియో ద్వారా భారీగా విమర్శలను ఎదుర్కొంటుంది.
సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప 2 (Pushpa 2) సినిమాతోపాటు రెయిన్ బో(Rain Bow),నితిన్ వెంకీ కొడుముల కాంబినేషన్లో మరో సినిమాలో కూడా నటిస్తున్నారు అలాగే బాలీవుడ్ యానిమల్ సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.







