మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పై సుప్రీంకోర్టు( Supreme Court ) తుది తీర్పు వెలువరించింది.బల నిరూపణ చేసుకోకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేసినందున ఉద్దవ్ థాకరే( Uddhav Thackeray ) ని మళ్లీ ముఖ్యమంత్రిగా పునరుద్ధరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పు తో కోర్టు తీర్పు పై చాలా ఆశలు పెట్టుకున్న ఉద్దవ్ వర్గం ఆశలపై నీళ్ళు చల్లినట్టైంది ….శివసేన వర్గానికి ముప్పు తప్పినట్లు అయింది అయితే తీర్పు సిందే వర్గానికి అనుకూలంగా వచ్చినట్లు కనిపిస్తున్నా గవర్నర్ వ్యవహార శైలి పై మాత్రం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది .ఉద్దవ్ థాకరే బలం కోల్పోయారు అనడానికి సరైన సమాచారం లేకుండానే ప్రభుత్వాన్ని బల నిరూపణ చేసుకోమని గవర్నర్ కోరడం సమంజసంగా లేదని కోర్టు అభిప్రాయ పడింది.

శివసేనలో( Shiv Sena ) రాజకీయ సంక్షోభం, అప్పటి గవర్నర్ వ్యవహార శైలి, స్పీకర్ ఎన్నికపై ఉద్దవ్ థాకరే సిందే వర్గాలు వేసిన పిటీషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్ర చూడ్( DY Chandra Choudh ) నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది.అయితే అవిశ్వాసం ప్రవేశపట్టుబడిన స్పీకర్కు ఎమ్మెల్యేలను అనర్హతవేటుకు గురి చేసే అధికారం ఉందా లేదా అన్న విషయంపై ఉన్నత స్థాయి న్యాయ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.సుప్రీంకోర్టు ఆదేశాలతో తమ ప్రభుత్వం పునరుద్ధరించబడుతుందన్న ఆశలు తీరకపోయినా గవర్నర్ వ్యవహార శైలిని సుప్రీంకోర్టు ఎండగట్టిన విధానంతో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ ప్రభుత్వాన్ని పడగొట్టింది అన్న సంకేతాలు ప్రజలకు వెళ్తాయని , ఆ సానుభూతి తమకు వచ్చే ఎన్నికల్లో పనికి వస్తుందన్న అంచనాలతో వద్ద వర్గం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తున్న రాజకీయ పార్టీల విధానాలని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించినట్లయ్యింది మరి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు అధికారంమే పరమావధిగా కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది
.






