కర్ణాటకలో అప్పుడే మొదలైన క్యాంప్ రాజకీయాలు??

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనకటికి ఎవరో.ఫలితాలు రానే లేదు.

 Camp Politcs Started Again In Karnataka Details, Karnataka, Karnataka Politics,-TeluguStop.com

ఎవరి బలం ఎంతో తేలలేదు అప్పుడే కర్ణాటకలో క్యాంప్ రాజకీయాలు( Karnataka Camp Politics ) మొదలైపోయాయని వార్తలు వస్తున్నాయి.గత అనుభవాల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల లోను గెలిచే తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు ముందస్తు వ్యూహాలు పన్నుతున్నట్టుగా తెలుస్తుంది… 2018 ఎన్నికలలో 104 స్థానాలు మాత్రమే గెలిచి మ్యాజిక్ ఫిగర్ కు కొద్దిగా ముందు ఆగిపోయిన బాజాపా( BJP ) కుర్చీలాటకు తెరతీసింది.…సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా కూడా తమను ప్రభుత్వం ఏర్పాటు చెయ్యనివ్వకుండా

Telugu Congress, Karnataka, Karnataka Hung-Telugu Political News

కాంగ్రెస్ జెడిఎస్( Congress JDS ) కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో రగిలిపోయిన భారతీయ జనతా పార్టీ రకరకాల ప్రలోభాలకు గురిచేసి రెండు పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించిఆ ప్రభుత్వాన్ని పడగొట్టి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అందువల్ల ఈసారి భాజపాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గెలిచిన తమ ఎమ్మెల్యేలను గోవాకు తరలించాలని రెండు పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నారట.కాంగ్రెస్ పార్టీకి సింగిల్గానే అధికారం వస్తుందని .కొన్ని సర్వేలు స్పష్టం చేసినప్పటికీ ఒకవేళ కొన్ని సీట్లు తగ్గితే మాత్రం భాజపా వ్యూహాలను తట్టుకొని నిలబడటం కష్టం కాబట్టి ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలను తమ అధీనంలోకి పెట్టుకునే పని కాంగ్రెస్ మొదలెట్టిందట.

Telugu Congress, Karnataka, Karnataka Hung-Telugu Political News

మరోవైపు జెడిఎస్ కూడా మరోసారి కర్ణాటకలో హంగు పరిస్థితి వస్తే చక్రం తిప్పవచ్చని ఆశపడుతుంది అని సమాచారం .దాదాపు అన్ని సర్వేలలోనూ తమ పార్టీకి 25 నుంచి 35 వరకు ఎమ్మెల్యేలు గెలుస్తారు అని రేపోర్టులు వచ్చిన దరిమిలా కచ్చితంగా తమ అవసరం ప్రభుత్వ ఏర్పాటు కి కావాలని ఆ పార్టీ బలంగా నమ్ముతుంది.అందుకోసం తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అతి ముఖ్యం కాబట్టి, ఎమ్మెల్యేలను ఎవరూ ప్రలోభాలకు గురి చేయకుండా కట్టడి చేయడం కోసం గోవాలో రిసార్ట్స్ కూడా బుక్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.మరి ఫలితాలు కూడా రాకుండానే క్యాంపు రాజకీయాలకు తెర తీసిన రాష్ట్రంగా కర్ణాటక రికార్డు సృష్టించేలా ఉంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube