జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించడం తెలిసిందే.ఈ క్రమంలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కచ్చితంగా వచ్చే ఎన్నికలలో పొత్తులతోనే ఎన్నికలను ఎదుర్కోబోతున్నట్లు స్పష్టం చేశారు.అందరిని ఒప్పించి ముందుకెళ్తామని పేర్కొన్నారు.
అయితే తన స్వార్ధ రాజకీయాల కోసం ఆలోచించటం లేదని.ముందుగా రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలన్నదే తన తాపత్రయమని స్పష్టం చేశారు.
పొత్తులు అనేవి ఒక కులానికి సంబంధించిన అంశం కాదు రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించింది.ఆ దిశగానే ఆలోచన చేసి పొత్తులు పెట్టుకోబోతున్నట్లు పవన్ పేర్కొన్నారు.

ఎలాగైనా వైకాపా ( YCP ) నుండి రాష్ట్రాన్ని కాపాడాలి అనేది తన ఆలోచన అని చెప్పుకొచ్చారు.ఇక ఇదే సమయంలో ముఖ్యమంత్రి పదవి వెనకాల పడే వ్యక్తిత్వం తనకు లేదని పవన్ చెప్పుకొచ్చారు.దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ( Director Ram Gopal Varma ) ట్విట్టర్ లో స్పందించారు.“ఆ రోజు ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన దానికంటే దారుణంగా ఈరోజు పవన్ తన జన సైనికులను, ఫ్యాన్స్ నీ వెన్నుపోటు పొడిచి చంపేశాడు… వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి” అంటూ వర్మ ట్వీట్ చేయటం జరిగింది.ఆర్జీవి చేసిన తాజా ట్వీట్ ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.







