మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉద్దవ్ ఠాక్రే స్పందించారు.విశ్వాస పరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేసిన కారణంగా ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని ధర్మాసనం పేర్కొంది.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు నైతికత ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం ఉన్న షిండే వర్గం ఎమ్మెల్యేలు తన పార్టీకి, వారసత్వానికి ద్రోహం చేశారని ఆరోపించారు.
తాను సీఎం పదవికి రాజీనామా చేయడం చట్టపరంగా తప్పు కావొచ్చన్న ఆయన నైతిక కారణాలతో రాజీనామా చేసినట్లు వెల్లడించారు.







