వేసవికాలంలో కూరగాయలను ఎక్కువగా తింటూ ఉండాలి.మరి ముఖ్యంగా వేసవికాలంలో వాటర్ కంటెంట్ ఉండే కూరగాయలను తీసుకోవడం చాలా ఆరోగ్యపరం.
ఈ వేడి ఉష్ణోగ్రతలో బీరకాయలు( Ridge Gourd )తినడం చాలా మంచిది.ఇది మిమ్మల్ని చల్లగా ఉంచుతోంది.
ఇక బీరకాయ నీటి శాతం అధికంగా ఉండే కూరగాయల్లో ఒకటి.ఇందులో క్యాలరీలు తక్కువ ఉంటాయి.
పోషకాలు ఎక్కువ ఉంటాయి.అయితే ఇందులో ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ b6, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, సెలీనియం లాంటి ముఖ్యమైన పోషకాలు బీరకాయలో ఉంటాయి.
అయితే బీరకాయలోని అధిక ఫైబర్ నీటి కంటెంట్( Fiber Content ) వలన ఇది మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది.అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను( Blood Sugar Levels ) కూడా సమతుల్యం చేస్తుంది.అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన విషపూరిత వ్యర్థాలను తొలగించడానికి తోడ్పడుతుంది.అంతేకాకుండా కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధించడంలో కూడా ఇది సహాయపడుతుంది.అందుకే ఇది కాలేయ పనితీరుకు అద్భుతమైన కూరగాయలు పరిగణించవచ్చు.ఇది మాత్రమే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఎండాకాలంలో అధిక శరీర వేడిని తగ్గించడానికి, వాపును తగ్గించడానికి బరువు నియంత్రించడానికి బీరకాయ అనేక విధాలుగా మీ ఆరోగ్యానికి సహాయపడుతుంది.
ఈ కూరగాయలలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, జింక్ లాంటి మూలకాలు ఉండడం వలన శరీరంలోని వాపును ఇది తగ్గించడంలో సహాయపడతాయి.అలాగే బీరకాయలు ఐరన్( Iron ), మాంగనీస్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.అయితే కొన్ని కూరగాయలలో పచ్చిగా తిన్నప్పుడు మరికొన్నింటిని ఉడికించి తిన్నప్పుడు క్రియాశీల పోషకాలు సులభంగా లభిస్తాయి.
అందుకే బీరకాయను సలాడ్లు, కూరలు, పప్పు లాగా వండుకొని తినాలి.ఎక్కువ నీరు ఉపయోగించి బీరకాయ అస్సలు వండకూడడు.ఎక్కువ సేపు వండితే నీటిలో విటమిన్లు కరిగిపోతాయి.