రష్మి గౌతమ్ (Rashmi Gautam)పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ ప్రస్తుతం బుల్లితెరపై పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసే రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా ఈమె ఎన్నో రకాల పోస్టులను చేస్తూ ఉంటారు.ముఖ్యంగా ఈమె పెట్ లవర్ అనే విషయం మనకు తెలిసిందే.
మూగజీవాలకు ఎవరైనా హాని చేస్తే వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు.

తాజాగా రష్మీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.రజస్వల అయిన 12 ఏళ్ల బాలికను తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి హత్య చేశారట.అయితే తన చెల్లెలు అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఉద్దేశంతోనే తన అన్నయ్య ఆ బాలికను హత్య చేశారనే విషయంపై రష్మీ స్పందించారు.
ఇలాంటి హత్యలు కేవలం సెక్స్ ఎడ్యుకేషన్ (Sex Education)లేకపోవడం కారణంగానే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఈమె చెప్పుకొచ్చారు.

సె**పట్ల సరైన ప్రాథమిక అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా రష్మి గౌతమ్ కామెంట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి మినిమం సె** ఎడ్యుకేషన్ ఎంతో అవసరం అంటూ ఈ సందర్భంగా రష్మీ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ఎక్స్ట్రా జబర్దస్త్ (Extra Jabardasth) కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company) కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.అలాగే స్పెషల్ ఈవెంట్స్ లో కూడా రష్మీ పాల్గొని సందడి చేస్తున్నారు.







