అదేంటి, క్రోమ్ బ్రౌజర్( Chrome browser ) వాడకుండా ఎలాగా? అనే అనుమానం కలుగుతోంది కదా.ఎందుకంటే ఇక్కడ ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కరూ తమకు కావలసిన సమాచారం కొరకు ఎక్కువగా వాడేది గూగుల్ క్రోమ్ బ్రౌజర్ నే.
అలాంటి క్రోమ్ బ్రౌజర్ వాడకుండా ఎలా? అనే సందేహాలు చాలామందికి కలగవచ్చు.అవును, భారతదేశం సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాల్లో గూగుల్ క్రోమ్( Google Chrome ) ని బ్రౌజింగ్ కోసం వాడుతున్నారు.
అయితే టెక్నాలజీ పెరిగిన తర్వాత అదే సమస్యగా మారుతోంది.

అయితే, అలా ఇంటర్నెట్ లో బ్రౌజింగ్( Browsing ) చేసినపుడు మీ బ్యాంకు ఖాతా ఎవరైనా హ్యాక్ చేయొచ్చు.అంతేకాకుండా మీ పీసీ, స్మార్ట్ ఫోన్లు హ్యాక్ అవకాశం కూడా వుంది.అందుకే బ్రౌజర్లు, యాప్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు.
గూగుల్ క్రోమ్ విషయంలో ఆ అప్ డేట్ అంశాన్నే మాల్ వేర్ కోసం ఎరగా వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.( Cyber criminals ) సెక్యూరిటీ కోసం ఇచ్చే అప్ డేట్లనే మాల్ వేర్ కోసం వాడేసుకుంటున్నారు ఈ దుండగులు.
ఈ మధ్య వెలుగు చూసిన నయా మోసం విషయంలో టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీరు ఏదైనా నకిలీ వెబ్ సైట్, హానికర లింక్ ఓపెన్ చేసినపుడు మీ ఫోన్ లోకి ఈ మాల్ వేర్ తేలిగ్గా చొరబడుతుంది.ముఖ్యంగా గూగుల్ క్రోమ్ యూజర్లు లక్ష్యంగానే ఈ లింక్స్ ని ఫార్వాడ్ చేస్తున్నట్లు నిపుణులు కనుగొన్నారు.మీరు ఈ డమ్మీ లింక్స్, నకిలీ వెబ్ సైట్లు పై క్లిక్ చేసినపుడు మీ ఫోన్లోకి ఒక ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది.
దాని ద్వారా మీ ఫోన్లోకి మాల్ వేర్ వంటిది ప్రవేశిస్తుంది.దాని ద్వారా హ్యాకర్లు మీ మొత్తం సమాచారాన్ని అత్యంత తేలికగా సేకరిస్తారు.ఆ మాల్ వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత మీ ఫోన్ లాగిన్స్, మీ బ్యాంక్ ఖాతా వివరాలు ఇలా అన్నీ వారికి చేరిపోతాయి అని చెబుతున్నారు.అందుకే మీరు ఇలాంటి విషయాలపైన జాగ్రత్త వహించాల్సి అవసరం ఎంతైనా వుంది.







