స్పైడర్ మాన్ ( Spider-Man )అనగానే అందరికీ హాలీవుడ్( Hollywood ) సూపర్ హీరో సినిమా స్ఫురణకు వస్తుంది.ఈ సిరీస్ లో వచ్చే సినిమాలు పిల్లలతో పాటు పెద్దవాళ్ళను కూడా ఎంతగానో అలరించాయి.
ఇప్పటికీ స్పైడర్ మాన్ సినిమా వస్తుంది అంటే జనాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ వుంటారు.ఇక ఆ సినిమాలో హీరో చేసే విన్యాసాలను జనాలు అంత త్వరగా మర్చిపోరు.
అందులోని సూపర్ హీరో అలవోకగా బిల్డింగులను ఎక్కేస్తూ, అక్కడినుండి ఇక్కడకి, ఇక్కడినుండి అక్కడికి దూకేస్తు ఉంటాడు.రెప్పపాటు కాలంలో జంప్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు.

అయితే అది సినిమా.అలాంటి విన్యాసాలు నిజ జీవితంలో చేయడం అసాధ్యం.ఇక అలాంటి విన్యాసాలు చేయాలని ప్రయత్నించి ప్రాణాలు పోయిన ఘటనలు కూడా మనం చూసాము.కానీ ఇక్కడ వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే, ఒక దొంగ ఏకంగా స్పైడర్ మాన్ ని గుర్తు చేసేలా షాకింగ్ విన్యాసం చేయడం ఇక్కడ చూడవచ్చు.
ఓ ఎత్తైన బిల్డింగ్ ని చక చక ఎక్కేసి అందరిని నివ్వెర పోయేలా చేశాడు.

ఈ ఘటన వెస్ట్ ఢిల్లీలో( West Delhi ) జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది.చోరీకి వచ్చిన ఒక దొంగ ఏకంగా నాలుగు అంతస్తుల భవనాన్ని స్పైడర్ మాన్ తరహా లోనే ఎక్కేసాడు.అది కూడా నిమిషం వ్యవధిలోనే.
దాంతో ఈ వీడియోపైన నెటిజన్లు తీవ్రస్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు.అయితే సరిగ్గా అదేసమయంలో ఆ నాలుగు అంతస్తుల భవనానికి కాస్త దూరంలో మరో భవనంలో ఉన్న వ్యక్తి ఇక ఇదంతా ఫోన్లో వీడియో తీయడం గమనార్హం.
ఇక వీడియో తియ్యడం దూరంనుండి గమనించిన ఆ దొంగ ఎంత స్పీడుగా ఆ బిల్డింగ్ ఎక్కడా అంతే స్పీడుగా కిందికి దిగేసాడు.సెకండ్ల వ్యవధిలోనే ఇలా నాలుగు అంతస్తులు భవనం ఎక్కడం దిగడం చూసి అతను రియల్ లైఫ్ స్పైడర్ మాన్ అంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు.







