మందుబాబులు తాగిన తర్వాత వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు.గొంతులో మందు పడితే చాలు వీరిలో ధైర్యం కూడా బీభత్సంగా పెరిగిపోతుంది.
మందు తాగి పాములతో ఆడుకున్న వారు, సింహాలను భయపెట్టిన మందుబాబులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.ఒక్కోసారి వీరు చేసే పనులు చూస్తే అవాక్కవ్వడం ఖాయం.
కాగా తాజాగా ఉత్తరాఖండ్‌లోని ( Uttarakhand ) రిషికేశ్‌లోని తపోవన్ ప్రాంతంలోని వీధుల్లో ఓ తాగుబోతు ( Drinker ) ఎద్దుపై స్వారీ చేస్తూ బీభత్సం సృష్టించాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండి ఎద్దు పై స్వారీ( Bull ) చేస్తూ తానేదో రాజు లాగా, తాను కూర్చుంది ఒక గుర్రంపై లాగా ప్రవర్తించాడు.దీనికి సంబంధించిన వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు చాలా దుకాణాలు మూతపడి ఉండటం కనిపించింది.దీన్ని బట్టి అది మిడ్ నైట్ అని తెలుస్తోంది.ఇక రోడ్లపై కొద్దిమంది వ్యక్తులు నిల్చనే ఉన్నారు.ఇలాంటి రోడ్డుపై సదరు తాగుబోతు ఎద్దు పై స్వారీ చేస్తూ సంచలనం సృష్టించాడు.దీన్ని స్థానికులలో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఉత్తరాఖండ్ పోలీసుల దృష్టిని ఆకర్షించింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు మందు బాబును పట్టుకున్నారు.తర్వాత అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.భవిష్యత్తులో జంతువుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించవద్దని వాటిని హింసించకూడదని అతడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
పోలీసులు ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.ఈ వీడియోలో సదరు వ్యక్తితో ఇకపై ఇలాంటి పనులు చేయనని పోలీసులు చెప్పించడం కూడా కనిపించింది.
చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు పోలీసుల వేగవంతమైన స్పందనను ప్రశంసించారు.అయితే, కొంతమంది ఆ వ్యక్తి ప్రవర్తనను సమర్థించారు.
దానిని తమిళ సంప్రదాయమైన జల్లికట్టుతో పోల్చారు.కాకపోతే వారు ఫన్నీగా అతడిని సపోర్ట్ చేశారు.







