జోర్దార్ వార్తల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి సుజాత( Sujatha ) అనంతరం బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో కూడా సందడి చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను ఆకట్టుకున్నారు.బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ఈమె జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో కమెడియన్ గా సందడి చేస్తూ వచ్చారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో రాకింగ్ రాకేష్( Rocking Rakesh ) టీమ్ లోసందడి చేస్తూ ఉన్నటువంటి సుజాత రాకేష్ ప్రేమలో పడి తనని వివాహం చేసుకొని ప్రస్తుతం వీరిద్దరూ వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా గడుపుతున్నారు.ఇక పెళ్లి తర్వాత సుజాత పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ సందడి చేస్తున్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిన సుజాత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాలను కూడా తెలియజేశారు.ఈ క్రమంలోనే రాకేష్ గారితో ఎలా ప్రేమలో పడ్డారు అంటూ యాంకర్ తనని ప్రశ్నించగా సుజాత తమ ప్రేమ విషయం గురించి తెలియజేశారు.అందరిలాగా రాకేష్ తో ప్రేమలో పడినప్పుడు గుండెల్లో గంటలు మోగలేదని, మెరుపులు రాలేదని సరదాగా నవ్వుతూ సమాధానం చెప్పారు.

జబర్దస్త్ కార్యక్రమంలో చేసే సమయంలో అమ్మ వాళ్లు ఇక్కడ లేకపోవడం వల్ల తాను ఒక్కదాన్నే ఇక్కడ ఉండేదని అయితే తనకు ఒంట్లో బాగా లేకపోయినా అలాగే షూటింగ్లకు వెళ్లేదని.ఇలా తనకు బాగా లేకపోతే రాకేష్ తనతో చాలా కేరింగ్ గా ఉండేవారు.ఇలాగే ఉంటే ఎలా కాస్త తిను తాగు టాబ్లెట్స్ వేసుకో అంటూ తనని చాలా కేర్ చేసేవారు.ఇలా నా పట్ల ఆయన చూపించినటువంటి ఆ కేరింగ్ కితాను పడిపోయానని అప్పుడే తనపై ప్రేమ చిగురించింది అంటూ ఈ సందర్భంగా సుజాత రాకేష్ ప్రేమలో పడిన విషయం గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







