సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు కేవలం సినిమాలే కాకుండా సైడ్ బిజినెస్ చేసే అలవాటు కూడా ఉంటుంది.ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తమ బిజినెస్ లను చూసుకుంటూ ఉంటారు.
వచ్చిన డబ్బులను పెట్టుబడి పెట్టి కొత్త కొత్త బిజినెస్ లు స్టార్ట్ చేస్తూ ఉంటారు.ఇప్పటికే చాలామంది నటీనటులు సైడ్ బిజినెస్ లు చేస్తూ బాగా సంపాదించుకుంటూ పోతున్నారు.
ఇక అందులో రకరకాల వాటిలో బిజినెస్ చేస్తుండగా.కొంతమంది టాలీవుడ్ హీరోలు రెస్టారెంట్ బిజినెస్ లు కూడా చేస్తున్నారని తెలిసింది.
ఇంతకు ఆ హీరోలు ఎవరు.వాళ్ళు నడిపించే బిజినెస్ లు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నాగచైతన్య:
అక్కినేని వారసుడు టాలీవుడ్ హీరో నాగచైతన్య( Naga Chaitanya ) సొంతంగా ఒక రెస్టారెంట్ బిజినెస్ నడిపిస్తున్నాడు.ఇక అది హైటెక్ సిటీ రోడ్, కావేరి హిల్స్ లో షోయు క్లౌడ్ కిచెన్ అనే రెస్టారెంట్.
అయితే ఇందులో కేవలం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని తీసుకొని వెళ్లడం మాత్రమే ఉంటుంది.ఇక్కడ డైనింగ్ ఉండదు.
అల్లు అర్జున్:
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న అల్లు అర్జున్ కూడా సినిమాలే కాకుండా సైడ్ బిజినెస్ లు కూడా చేస్తూ ఉంటాడు.అయితే ఈయనకు కూడా ఒక రెస్టారెంట్ ఉండగా అది జూబ్లీహిల్స్ లో బఫెలో వైల్డ్ వింగ్స్ అనే పేరుతో ఉంది.
ఈ రెస్టారెంట్ బాగా నడుస్తూ ఉంటుంది.

సందీప్ కిషన్:
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కూడా ఒక రెస్టారెంట్ ను నడిపిస్తున్నాడు.ఇక ఆ రెస్టారెంట్ పేరు వివాహ భోజనంబు.ఆ రెస్టారెంట్ వచ్చేసి జూబ్లీహిల్స్ లో ఉంది.ఈ రెస్టారెంట్ నుండి సందీప్ కిషన్ బాగా సంపాదిస్తున్నాడని తెలుస్తుంది.
మహేష్ బాబు – నమ్రత:
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మహేష్ బాబు దంపతులు కూడా ఏఎన్ రెస్టారెంట్ ను నడిపిస్తున్నారు.ఇది వచ్చేసి బంజారాహిల్స్ లో ఉంది.ఈ రెస్టారెంట్ కూడా బాగా నడుస్తుంది.

దగ్గుబాటి రానా:
దగ్గుబాటి వారసుడు రానా కూడా సినిమాలే కాకుండా బిజినెస్ లు కూడా చేస్తూ ఉంటాడు.అది వచ్చేసి శాంక్చ్యువరీ బార్ అండ్ కిచెన్.ఇక ఇది బంజారాహిల్స్ లో ఉంది.ఇక ఈ రెస్టారెంట్ ను రానా చిన్ననాటి ఇల్లునే అలా మార్చాడని తెలుస్తుంది.

ఆనంద్ దేవరకొండ:
విజయ్ దేవరకొండ సోదరుడైన ఆనంద్ దేవరకొండ కూడా రెస్టారెంట్ బిజినెస్ ను నడిపిస్తున్నాడు.అది వచ్చేసి కాజాగూడలో గుడ్ వైఫ్ ఓన్లీ కేఫ్ అనే రెస్టారెంట్ ని నడిపిస్తున్నాడు.

ఇలా ఈ హీరోలే కాకుండా మిగతా హీరోలు కూడా పలు రకాల బిజినెస్ లు చేస్తున్నారు.కొంతమంది హీరోయిన్లు కూడా బిజినెస్ రంగాలలో అడుగుపెట్టి బాగా సంపాదించుకుంటూ పోతున్నారు.మొత్తానికి హీరో హీరోయిన్లు సినిమాల ద్వారా వచ్చిన డబ్బులను పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తున్నారని తెలుస్తుంది.







