టాలీవుడ్ లో ఇప్పుడు ఆదిపురుష్ ట్రైలర్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.గత కొన్నాళ్లుగా ఈ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.
మాములు ఆడియెన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.మరి ఎట్టకేలకు ఈ రోజు ట్రైలర్ రాబోతుంది.
దీంతో వీరి ఎగ్జైట్మెంట్ తగ్గుతుంది.
ఇక ప్రభాస్ ఫ్యాన్స్ లాగానే ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా అప్డేట్ కోసం ఇంతే ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు.
స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకరు.ఈయన క్రేజ్ మరే హీరోకు లేదు అనే చెప్పాలి.పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh) .
ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే వీరి కాంబో అలాంటిది.డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న క్రమంలోనే ఈ కాంబోపై అంచనాలు పెరిగాయి.గబ్బర్ సింగ్ రేంజ్ కంటే డబుల్ గా ఉస్తాద్ ను ఫ్యాన్స్ ఉహించు కుంటున్నారు.

ఇక ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయింది.ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడంతో హైప్ పెరగడమే కాకుండా పవర్ స్టార్ మరోసారి ఖాకీ చొక్కా వేయడంతో మరింత హైప్ పెరిగింది.ఇది పక్కన పెడితే తాజాగా ఈ సినిమా గ్లింప్స్ గురించి ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.
ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైట్ మెంట్ గా ఉన్నారు.

గబ్బర్ సింగ్ వచ్చిన 11 ఏళ్ల తర్వాత ఈ కాంబో రావడంతో ఒక్కసారిగా సెన్సేషనల్ గా మారిపోయింది.పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసారు.మరి ఈ టీజర్ గ్లిమ్స్ మే 11న రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఇది ఎలా ఉంటుందో తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.
ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే శ్రీలీల (SreeLeela) హీరోయిన్ గా నటిస్తుండగా.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.







