కేరళ స్టోరీ సినిమాపై బెంగాల్ ప్రభుత్వం నిషేధం..!!

“ది కేరళ స్టోరీ( The Kerala Story ) సినిమా పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా నిషేధం విధించడం జరిగింది.ఆల్రెడీ ఈ సినిమాపై తమిళనాడు ప్రభుత్వం తో పాటు కొన్ని ప్రాంతాలలో నిషేధం విధించడం జరిగింది.

 Kerala Story Movie Banned By Bengal Govt The Kerala Story, Mamatha Banerjee ,ben-TeluguStop.com

దేశవ్యాప్తంగా ఈ సినిమా తీవ్ర వివాదాస్పదం కావడంతో పాటు.వివిధ రాజకీయ పార్టీలు మరియు ముస్లిం సంఘాలు.

తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.దీంతో అనేకచోట్ల ఈ సినిమా ప్రదర్శనలను థియేటర్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా నిలిపివేశాయి.

ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ మరియు విద్వేష నేరాలు, హింస వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందని మమతా బెనర్జీ స్పష్టం చేయడం జరిగింది.

ఇదే సమయంలో మణిపూర్( Manipur ) లో జరుగుతున్న హింసకాండ పై కూడా విమర్శలు చేశారు.

అదే తరహా ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగి ఉంటే… ఇక్కడి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయటానికి కేంద్ర ప్రభుత్వం  వందలాది కేంద్ర బలగాలు.దింపేవారని దీదీ పేర్కొన్నారు.

మణిపూర్ బీజేపీ పాలిత రాష్ట్రం కావడంతో అలాంటిదేమీ జరగడంలేదని చెప్పుకొచ్చారు.

మణిపూర్ హింసకాండలో ఎంతమంది మరణించారు అన్న విషయంలో వాస్తవ లెక్కలు బయటపడటం లేదని ఆరోపించారు.మణిపూర్ లో ఉన్న బెంగాలీలను రాష్ట్రానికి రప్పించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షిస్తున్నట్లు మమతా బెనర్జీ( Mamatha Banerjee ) స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube