టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.రేవంత్ రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని సూచించారు.
రేవంత్ తనకు తాను గొప్ప నాయకుడని ఊహించుకుంటున్నారని విమర్శించారు.రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తూ రాజకీయాలు చేస్తాడని ఆరోపించారు.
అనంతరం మోదీపై మండిపడ్డ మంత్రి వేముల ఆయనో అసమర్థ ప్రధాని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.పెట్రోల్, డీజిల్ ధర డబుల్ చేసిన ఏకైక ప్రధాని మోదీ అని మండిపడ్డారు.
ఎల్ఐసీ డబ్బులు అదానీ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నారన్నారు.ప్రజల డబ్బును ప్రైవేట్ కంపెనీలో పెట్టడానికి మోదీ ఎవరని ప్రశ్నించారు.







