గత రెండు రోజులుగా సమంత( Samantha ) నాగచైతన్య( Nagachaitanya ) వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారాయి వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు(Divorce) తీసుకొని విడిపోయారు అయితే విడాకులకు గల కారణాలను కూడా నాగచైతన్య కస్టడీ సినిమా ( Custody Movie ) ప్రమోషన్ కార్యక్రమాలలో బయటపెట్టారు.ప్రస్తుతం నాగచైతన్య కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ప్రశ్నలు రావడంతో నాగచైతన్య ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగచైతన్యను యాంకర్ ప్రశ్నిస్తూ మీ లైఫ్ లో ఫస్ట్ డేట్ ఫస్ట్ కిస్( First Kiss ) గురించి చెప్పమని కోరారు.ఈ ప్రశ్నకు నాగచైతన్య ఎంతో ఆసక్తికరమైన విషయాలు తెలియచేశారు.తాను ఆరో తరగతిలో చదువుతున్న సమయంలోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని తెలిపారు.
ఇక ఇంటర్ చదువుతున్న సమయంలో ఒక అమ్మాయితో కలిసి కాఫీ డేట్ కి వెళ్లానని ఈ సందర్భంగా నాగచైతన్య వెల్లడించారు.ఇక ఫస్ట్ కి విషయానికి వస్తే ఈయన తన ఆఫ్ స్క్రీన్ కిస్ గురించి చెప్పడం బాగోదని తెలియజేశారు.

ఇలా ఆఫ్ స్క్రీన్ లో కాకుండా ఆన్ స్క్రీన్ లో తన ఫస్ట్ కిస్ సమంతకే పెట్టానని తెలియజేశారు.సమంత నాగచైతన్య నటించిన చిత్రం ఏ మాయ చేసావే ఈ సినిమాలో పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య ముద్దు సన్నివేశాలు ఉన్న విషయం మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే ఆన్ స్క్రీన్ పై తన ఫస్ట్ కిస్ ఈ సినిమాలో సమంతకి పెట్టాను అంటూ నాగచైతన్య ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక నాగచైతన్య సమంత ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో వీరిద్దరూ కలిసి దాదాపు మూడు నాలుగు సినిమాలలో నటించారు.
ఈ క్రమంలోనే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం అనంతరం విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది.







