యాదాద్రి భువనగిరి జిల్లా శాస్త్ర సాంకేతిక యుగంలో గ్రహాలు దాటుతున్న మనిషి మరోవైపు మూఢనమ్మకాలతో ఊర్లో మూడు బాటల కూడలిలో వేసిన నిమ్మకాయను దాటలేకపోవడం విడ్డూరంగా ఉందని యాదాద్రి భువనగిరి జిల్లావిజ్ఞానవంతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే… యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ) మోటకొండుర్ మండలం కాటెపల్లి గ్రామానికి చెందినసుదగాని అనిల్ అనేదొంగ బాబా దేవతలు నన్ను ఆవహించారు.
దేవదూతను నేను అని ప్రజలలో ఉన్న మూఢ నమ్మకాలు,మూఢ భక్తిని సొమ్ము చేసుకుంటూ, దోచుకుంటున్న విషయం తెలిసి ఆ దొంగ బాబాను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ప్రజలు నమ్మినంత కాలం ప్రతి ఊరిలో ఇలాంటి దొంగ బాబాలు( Fake Baba ),స్వాములు నిత్యం పుడుతూనే ఉంటారని,తరచుగా దొంగ స్వాములు,బాబాల బండారం బయట పడుతున్నా,పోలీసులు వారిని అరెస్టులు చేస్తున్నా ప్రజల ఆలోచన విధానం మారడం లేదని అంటున్నారు.
ప్రజలే హేతు బద్ధంగా ఆలోచించాలి,చైతన్యం కావాల్సిన అవసరం ఉందని,ఉన్నత చదువులు చదివిన వారు,ఉద్యోగులు కూడా మూఢ నమ్మకాలను నమ్మడం విస్మయం కలిగిస్తోందని అంటున్నారు.