దాదాపు 70 సంవత్సరాల తర్వాత బ్రిటన్‌లో( Britain ) పట్టాభిషేక కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది.కింగ్ ఛార్లెస్-3 ( King Charles-3 )బ్రిటన్‌తో పాటు మరో 14 రాజ్యాలకు రాజుగా పట్టాభిషేకం చేయించుకున్నాడు.
క్వీన్ ఎలిజబెత్-2 ( Queen Elizabeth-2 )గత ఏడాది సెప్టెంబరులో కన్నుమూసిన తర్వాత వేలాది మంది ప్రజలు, విదేశాలకు చెందిన అతిథుల నడుమ ఈ పట్టాభిషేకం ఎంతో వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా కింగ్ ఛార్లెస్ బాడీగార్డు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.
అవును, గత ఏడాది కాలంగా ఛార్లెస్-3 ఎక్కడికి వెళ్లినా.ఓ వ్యక్తి తన వెన్నంటే ఉంటున్నాడు.ఆ వ్యక్తి గుబురు మీసాలతో, దృఢమైన శరీరం కలిగి ఆజానుభావుడిగా కనబడుతున్నాడు.అతను మరెవరో కాదు, అతని బాడీ గార్డ్.అవును, గతంలో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2కి రక్షణ కల్పించిన సెక్యూరిటీ బృందాన్నే ప్రస్తుతం ఛార్లెస్-3 కొనసాగిస్తున్నారు.ఎలిజబెత్-2 అంత్యక్రియల సమయంలోనూ ఈ బాడీగార్డు అందరి దృష్టినీ ఆకర్షించారు.
గత ఏడాది కాలంలో కింగ్ ఛార్లెస్-3 పాల్గొన్న దాదాపు అన్ని కార్యక్రమాల్లో కూడా ఇతగాడు అనుక్షణం రక్షణగా వున్నాడు.ఒకసారి ఓ మహిళ కింగ్ ఛార్లెస్-3 వీడియోను తీస్తుండగా ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కొని, వీడియో తీయొద్దని వారించడం సామాజిక మాధ్యమాల్లోనూ అప్పట్లో వైరల్ అయ్యింది.కాగా చాలామంది ఆ బాడీ గార్డును కింగ్స్‌మ్యాన్ సినిమాలోని బ్రిటన్-ఇటాలియన్ నటుడు కొలిన్ ఫిర్త్‌తో( Colin Firth ) పోల్చుతున్నారు.అతడు ఎవరైనప్పటికీ.గతంలో క్వీన్ ఎలిజబెత్-2, ఆ తర్వాత కింగ్ ఛార్లెస్-3 కూడా ఆయన్ని రక్షణ అధికారిగా నియమించుకోవడం రాజకుటుంబీకులకు అతడిపై ఉన్న నమ్మకానికి అద్దం పడుతోంది.