వచ్చే ఏడాదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏదో రకంగా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ( TDP ) ఉంది.ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం కంటే, పొత్తులతో ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి రావాలని చూస్తుంది.
దీనిలో భాగంగా జనసేన పార్టీతోనే పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమైంది.ఇక పొత్తులతో సంబంధం లేకుండా టిడిపిని మరింతగా బలోపేతం చేసేందుకు సిద్ధమవుతోంది.
దీనిలో భాగంగానే రాజమండ్రి వేదికగా పార్టీ మహానాడు ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, ఎక్కడికక్కడ మహానాడులు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని నిర్ణయించుకుంది.

ఇక రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాలని, కొన్ని కొన్ని నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జిలను నియమించాలని నిర్ణయించారు.దీనిపైన మహానాడులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇక టిడిపి జనసేన పొత్తు అంశం పైన ఈ మహానాడులో ప్రధానంగా చర్చ జరగబోతుంది.

ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు( Pawan kalyan ) నివాసానికి వెళ్లి పొత్తుల అంశంపై చర్చించారు.దీనిపై మరింత క్లారిటీ తెచ్చుకుని రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లే విషయంపై కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ మహానాడులోనే వైసీపీ( YCP ) నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయట.ముఖ్యంగా వైసీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి ఈ స్థాయిలో చేరికలు ఉండేలా చూసుకుంటే ఆ పార్టీని దెబ్బ కొట్టవచ్చని, మరింతగా పార్టీలోకి చేరికలు ప్రోత్సహించవచ్చు అని టిడిపి అంచనా వేస్తోందట.
దీంతో మహానాడు లో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటూ, వైసీపీని దెబ్బ కొట్టే విధంగా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు టిడిపి సిద్ధమవుతోంది.







