కొరియోగ్రాఫర్ చైతన్య( Chaitanya ) ఏప్రిల్ 30వ తేదీ నెల్లూరులోని ఒక హోటల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈయన చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి చనిపోయారు.
తనకు అప్పులు బాధలు ఎక్కువయ్యాయని ఆ ఒత్తిడి భరించలేక తాను ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ ఈ వీడియో ద్వారా ఆయన మరణానికి గల కారణాలను తెలియజేశారు.ఇలా చైతన్య మరణించిన అనంతరం తన తల్లి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి చైతన్య తల్లి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

తన కుమారుడు అప్పులు బాధలు భరించలేక మరణించారని చెప్పారు.అయితే తనకు అప్పులు ఉండే ప్రసక్తే లేదని తన తల్లి చెప్పుకొచ్చారు.ఇక ఢీ షోలో పాల్గొంటున్న సమయంలో అప్పుడప్పుడు కాస్ట్యూమ్స్ కోసం నాకు కాస్త డబ్బులు అవసరం అవుతాయి అంటే ఇచ్చే దానిని చైతన్య తల్లి (Chaitanya Mother)లక్ష్మీ తెలిపారు.
అయితే ఓసారి ఢీ ఫైనల్( Dhee Finals ) కోసం తనని మూడున్నర లక్ష డబ్బు అడిగారు.ఫైనల్ లో గెలిస్తే నాకు ఏడున్నర లక్షలు డబ్బులు వస్తాయి.
నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాను అమ్మ అని నాకు చెప్పారు.ఇదే విషయం వాళ్ళ నాన్నకు చెబితే వాడిని చెడు కొడుతున్నావు అంటూ నన్ను తిట్టారని, అయినప్పటికీ తన నాన్నకు తెలియకుండా రెండుసార్లు ఢీ ఫైనల్ కోసం తనకు ఆరు లక్షల వరకు డబ్బు ఇచ్చానని తెలిపారు.

ఇక ఫైనల్లో తన కుమారుడు గెలవలేకపోయారని లక్ష్మి తెలిపారు.ఇలా తన కోసం ఆరు లక్షలు ఇచ్చిన దానిని అప్పులు ఉన్నాయని చెబితే చెల్లించలేమా.తన కొడుకుకు అప్పులు ఉండే ప్రసక్తే లేదని ఈమె ధీమా వ్యక్తం చేశారు.ఇక ఢీ షో కారణంగా తన కుమారుడికి ఎంత సంపాదన వస్తుంది ఏంటి అనే విషయం తనకు ఏ మాత్రం తెలియదని కానీ ఒక విషయం మాత్రం తాను చెప్పగలనని ఢీ లేకపోతే తన కుమారుడికి ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చేవి కాదు అంటూ చైతన్య తల్లి లక్ష్మి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







