మూగ జంతువులతో పరాచకాలు ఆడుతూ వాటిని ఇబ్బంది పెట్టే జనాలు చాలామందే ఉన్నారు.ఒక్కోసారి వీరు రిస్కులు చేస్తూ వాటికి తలనొప్పులు కలిగిస్తుంటారు.
కాగా తాజాగా ఒక వ్యక్తి ఎద్దుతో పరాచకాలు ఆడాడు.దాని నుంచి నుంచి తప్పించుకునేందుకు ఈ వ్యక్తి ఎలక్ట్రిక్ పోల్( Electric pole ) పైకి ఎక్కాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో ఎద్దు ఆ వ్యక్తి వైపు దూసుకుపోతున్నట్లు కనిపించింది.
అతను వీధి అంచున ఉన్న ఒక కరెంట్ పోల్‌ను త్వరగా ఎక్కి పొడిచే ఎద్దు నుంచి ఎస్కేప్ అయ్యాడు.నిజానికి ఆ ఎద్దును విద్యుత్ పోల్‌కు కట్టారు.

అయితే దానిని రెచ్చగొట్టేందుకు సదరు వ్యక్తి పోల్ ఎక్కి నాటకాలు చేశాడు.ఎద్దు ఆ వ్యక్తిని తప్పించుకోకుండా పోల్ చుట్టూ తిరుగుతుంది.ఎందుకంటే ముందుగా చెప్పినట్టు ఎద్దు మెడకు తాడు కట్టి, దానిని స్తంభానికి కట్టినట్లు తెలుస్తోంది.ఎద్దు పోల్ వద్దకు తిరిగి వచ్చే ముందు సమీపంలోని పొలంలోకి పరుగెత్తడంతో వీడియో ముగుస్తుంది.
ఈ క్లిప్ ఇన్‌స్టాగ్రామ్‌లో 70 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది.స్పెయిన్‌లోని శాన్ ఫెర్మిన్ ఫెస్టివల్( San Fermin Festival in Spain ) సందర్భంగా ఈ ఫుటేజీ షూట్ చేశారని సమాచారం.
ఇక్కడ ప్రజలు ఎద్దుల వెంట వీధుల్లో పరిగెత్తారు.ఎద్దులు తమ దూకుడుకు ప్రసిద్ధి చెందాయి.
పండుగలో పాల్గొనేవారు గాయపడటం లేదా చనిపోవడం సాధారణంగా జరుగుతుంటుంది.అయినా ప్రజలు తమ ప్రాణాలతో పాటు ఎద్దుల ప్రాణాలను రిస్క్‌లో పెడుతుంటారు.







