'టైగర్ 3'.. కేవలం యాక్షన్ సీన్స్ కోసమే 35 కోట్ల సెట్!

ఒక సినిమా సక్సెస్ అయితే వెంటనే దానికి సీక్వెల్ గా మరికొన్ని సినిమాలు చేయడం బాలీవుడ్( Bollywood ) లో ఎప్పటి నుండో ఉన్న అలవాటునే.మరి ఈ క్రమంలోనే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ టైగర్.

 Aditya Chopra Has Spent Over Rs. 35 Crore To Massive Action, Aditya Chopra, Tige-TeluguStop.com

ఈ సినిమా ఇప్పటికే రెండు పార్టులు రిలీజ్ అవ్వగా రెండు కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.ఏక్ థా టైగర్ తో మొదలైన సీక్వెన్స్ ఇప్పటికి కొనసాగుతూనే ఉంది.

మొదటిగా 2012లో విడుదల అవ్వగా తర్వాత సీక్వెన్స్ 2017లో టైగర్ జిందా హై రిలీజ్ అయ్యింది.ఈ రెండు పార్ట్శ్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి.అప్పట్లోనే 100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టాయి.ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ( Salman Khan ) రా ఏజెంట్ గా కనిపించాడు.

ఇక ఇప్పుడు టైగర్ 3 ( Tiger 3) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.సల్మాన్ ఖాన్ తో పాటు షారుఖ్ ఖాన్ ( Shah Rukh Khan ) కూడా ఈ సినిమాలో నటిస్తుండడంతో ఈ సీక్వెన్స్ పై అంచనాలు భారీగా పెరిగాయి.

Telugu Aditya Chopra, Adityachopra, Manish Sharma, Salman Khan, Shah Rukh Khan,

ఇద్దరు బడా స్టార్స్ ఉండడంతో ఈ సినిమాకు బడ్జెట్ కూడా భారీగానే పెడుతున్నట్టు సమాచారం.మనీష్ శర్మ( Manish Sharma ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆదిత్య చోప్రా ( Aditya Chopra ) నిర్మాతగా ఉన్నారు.ఇక ఈ సినిమా మే 8 నుండి షూటింగ్ స్టార్ట్ చేస్తుండగా.

అదిరిపోయే అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఏకంగా 35 కోట్లతో ఒక సెట్ వేసారట.

Telugu Aditya Chopra, Adityachopra, Manish Sharma, Salman Khan, Shah Rukh Khan,

ఒక్క సెట్ కోసమే ఈ రేంజ్ లో డబ్బులు పెట్టడం విశేషం.ఈ సినిమాలో సల్మాన్, షారుఖ్ మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని.వాటిని తెరకెక్కించడం కోసం ఈ సెట్ ను ఇంత భారీగా నిర్మించారని తెలుస్తుంది.

అలాగే 10 నుండి 12 రోజుల పాటు ఈ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారట.మరి మిగిలిన సినిమా మొత్తం పూర్తి అవ్వడానికి ఇంకెంత బడ్జెట్ పెడతారో వేచి చూడాలి.

ఇక ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube