టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగచైతన్య కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.నాగచైతన్య నటించిన కస్టడీ మూవీ( Custody ) ఈ నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.అయితే నాగచైతన్య పరశురామ్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది.

ఈ సినిమా గురించి ప్రస్తావన రాగా పరశురామ్( Director Parasuram ) గురించి చైతన్య మాట్లాడుతూ ఏం జరిగిందో మీకు తెలుసు.ఆయన నా సమయాన్ని వృథా చేశారని చెప్పుకొచ్చారు.అలాంటి వ్యక్తి గురించి మాట్లాడటం కూడా వృథా అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.సినిమా కథకు కస్టడీ అనే టైటిల్ యాప్ట్ టైటిల్ అని చైతన్య కామెంట్లు చేశారు.
ఈ మూవీలో రెండు బలమైన పాత్రల మధ్య తన పాత్ర ఉంటుందని ఆయన అన్నారు.
ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని ఆయన తెలిపారు.
తనకు వేరేవాళ్లతో ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారని చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు.శోభితకు తనకు మధ్య ఏమీ లేదనే అర్థం వచ్చేలా నాగచైతన్య( Naga Chaitanya ) కామెంట్లు చేశారు.
సినిమా బాలేదని తెలిసిన తర్వాత ఆ సినిమాను ప్రమోట్ చేయడం సులువు కాదని ఆయన అన్నారు.థాంక్యూ కథ నచ్చినా ఎడిటింగ్ చేసిన తర్వాత ఆ సినిమా రిజల్ట్ పై సందేహం వచ్చిందని చైతన్య పేర్కొన్నారు.

అక్కినేని అభిమానులకు భారీ సక్సెస్ ఇవ్వాలనే ఒత్తిడి నాపై ఉందని ఆయన చెప్పుకొచ్చారు.ప్రేక్షకులను థియేటర్ కు రప్పించాలంటే ఏదో ఒకటి ఉండాలని చైతన్య పేర్కొన్నారు.కృతిశెట్టి( Krithi Shetty) రోల్ ఫన్ పండిస్తుందని సినిమా అంతటా ఆ పాత్ర ఉంటుందని నాగచైతన్య అన్నారు.కస్టడీ సినిమాకు అరవిందస్వామి, శరత్ కుమార్ పాత్రలు కీలకమని ఆయన తెలిపారు.