ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు సుకేశ్ చంద్రశేఖర్ మరో లేఖ

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ మరో లేఖ రాశారు.తన న్యాయవాది ద్వారా లేఖను విడుదల చేశారు.

 Another Letter From Sukesh Chandrasekhar To Lt Governor Of Delhi-TeluguStop.com

ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఎల్ జీకి సుకేశ్ ఫిర్యాదు చేశారు.కేజ్రీవాల్ కోసం ఫర్నీచర్ ను తానే కొనుగోలు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.రూ.45 లక్షలతో 12 సీట్ల డైనింగ్ టేబుల్, రూ.34 లక్షలతో డ్రెస్సింగ్ టేబుల్స్, రూ.18 లక్షలతో అద్దాలు, రూ.28 లక్షలతో బెడ్ రూమ్ సామాగ్రి, రూ.45 లక్షలతో గోడ గడియారాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు.ఇటలీ, ఫ్రాన్స్, ఢిల్లీ,ముంబైలో ఫర్నీచర్ కొనుగోలు చేశానన్నాడు.ఈ మేరకు ఫర్నీచర్ బిల్లులను దర్యాప్తు సంస్థలకు అందించినట్లు వెల్లడించారు.కేజ్రీవాల్ నివాసంలో ఉన్న ఫర్నీచర్ కొనుగోలుపై దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరపాలని లేఖలో కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube