తెలంగాణ సెక్రటేరియట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.సచివాలయానికి వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు.
దీనిపై స్పందించిన రాజాసింగ్ మాట్లాడుతూ అనుమతి లేదని పోలీసులు తనని వెనక్కి పంపించారని తెలిపారు.మంత్రి తలసాని రివ్యూ మీటింగ్ కు సిటీ ఎమ్మెల్యేలను ఆహ్వానించారన్నారు.
ఈ క్రమంలో సెక్రటేరియట్ కు వెళ్తే అనుమతి లేదని అడ్డుకున్నారని మండిపడ్డారు.ఎమ్మెల్యేలనే రానివ్వని సచివాలయంలోకి ప్రజలను రానిస్తారా అని ప్రశ్నించారు.