Kriti Shetty : నాగచైతన్యతో నటించడం మంచి ఎక్స్పీరియన్స్…. బేబమ్మ కామెంట్స్ వైరల్!

నాగచైతన్య( Nagachaitanya ) కృతి శెట్టి( Kriti Shetty ) హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కస్టడీ(Custody) .ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Acting With Naga Chaitanya Was A Good Experience Bebammas Comments Went Viral-TeluguStop.com

ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ఒకేసారి విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం తమిళంలోనూ తెలుగులోనూ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చెన్నైలో చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Telugu Kriti Shetty, Naga Chaitanya, Prabhu, Tollywood-Movie

ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి నటించారు.ఈ సందర్భంగా కృతి శెట్టి మాట్లాడుతూ… ఇది నాకు తమిళంలో ఇది రెండవ సినిమా.అలాగే నాగచైతన్యతో కూడా తనకు ఇది రెండవ సినిమా అని తెలిపారు.నాగచైతన్యతో నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ( Experience )అని,అతనితో నటించడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుందని కృతి శెట్టి ఈ సందర్భంగా నాగచైతన్యతో నటించడం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక కృతి శెట్టి ఇదివరకే నాగచైతన్యతో కలిసి బంగార్రాజు( Bangarraju ) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Telugu Kriti Shetty, Naga Chaitanya, Prabhu, Tollywood-Movie

సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ చిత్రంగా వచ్చినటువంటి ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటించారు.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే మరోసారి ఇద్దరు కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు.

ఇక ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది.ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్లను కనుక చూస్తుంటే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈసారి నాగచైతన్య ఈ సినిమాతో హిట్టు కొట్టాలన్న కసితోనే ఉన్నారు.ఇక ఈ సినిమాకు వెంకట్ ప్రభు( Venkat Prabhu ) దర్శకత్వం వహించగా…ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆయన కుమారుడు యువన శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube