”హనుమాన్”.ఈ సినిమా కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది.అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూసారు.
అయితే ఈ సినిమా మరింత ఆలస్యం అవ్వబోతున్నట్టు తెలుస్తుంది.మేకర్స్ ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో ప్రేక్షకులు కొద్దిగా నిరాశ చెందారు.

ప్రశాంత్ వర్మ ( Prasanth Varma ) దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ ( Teja Sajja ) హీరోగా అమృత అయ్యర్ ( Amritha Aiyer ) హీరోయిన్ గా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ”హను-మాన్” (HanuMan).ఈ సినిమా ముందు నుండి అనుకున్న విధంగా జరిగి ఉంటే ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది.కానీ మేకర్స్ ఈ సినిమాకు ఉన్న అంచనాల దృష్ట్యా వీఎఫ్ఎక్స్ విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.అందుకే ఆదిపురుష్ సినిమా కంటే కూడా ఈ చిన్న సినిమా బాగుంది అని కామెంట్స్ వినిపించాయి.

ఒకానొక దశలో ఆదిపురుష్ కంటే కూడా హనుమాన్ బెటర్ అంటూ ప్రేక్షకుల నుండి స్పందన రావడంతో ఈ సినిమా గురించి అందరు ఆసక్తిగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండాలని మేకర్స్ కూడా చర్యలు తీసుకుంటున్నారు.ఇందులో భాగంగానే ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ మరింత బాగా రావడం కోసం కొంత సమయం తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించు కున్నారట.

అందుకే ఈ సినిమాపై ఉన్న అంచనాలను అందుకోవడానికి మరికాస్త సమయం కావాలని.ఇందుకోసం ఎక్కువ సమయం వీఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు.దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు, ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.
ఆదిపురుష్ విడుదల తర్వాతే హనుమాన్ విడుదల అవ్వాలని కొందరు కోరుకుంటున్నారు.మరి తాజా వాయిదాతో ఇదే జరుగుతుంది అంటున్నారు.