ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయంలో దుండగుల దుశ్చర్య.. గోడలపై భారత్‌పై పిచ్చిరాతలు

ఈ నెలాఖరులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ( Narendra Modi )పర్యటన నేపథ్యంలో ఆస్ట్రేలియాలో దుండగులు రెచ్చిపోయారు.సిడ్నీలోని ప్రసిద్ధ హిందూ దేవాలయం గోడలపై భారత్‌ను ఉద్దేశిస్తూ పిచ్చిరాతలు రాశారు.

 Hindu Temple In Australia Defaced By ‘anti-social Elements’ With ‘anti-ind-TeluguStop.com

సిడ్నీ రోడ్‌హిల్‌లోని బీఏపీఎస్ శ్రీ స్వామి నారాయణ్ మందిర్‌లో ఈ ఘటన జరిగింది.అయితే ఈ ఘటన జరిగిన సమయం తెలియరాలేదు.

కానీ ఆలయ అధికారులు గేటుపై ఖలిస్తానీ జెండాను కనుగొన్నారు.దీంతో ఖలిస్తాన్ సానుభూతిపరులే ఈ ఘటనకు పాల్పడి వుంటారని భావిస్తున్నారు.

వెంటనే విషయాన్ని న్యూసౌత్ వేల్స్ పోలీసులకు తెలియజేసినట్లు ఆస్ట్రేలియా( Australia ) టుడే వార్తాపత్రిక నివేదించింది.

Telugu Andrew Charlton, India, Australia, Baps, Hindutemple, Narendra Modi, Sris

ఈ దాడిపై బీఏపీఎస్ శ్రీస్వామి నారాయణ్ మందిర్ కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఇటీవలి కాలంలో కొందరు దుండగులు హిందూ ఆలయాలను టార్గెట్ చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.సిడ్నీలోని బీఏపీఎస్ స్వామి నారాయణ్ మందిర్ స్థానిక సమాజానికి మూలస్తంభంగా వుందని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా వున్న అన్ని బీఏపీఎస్ దేవాలయాల మాదిరిగానే శాంతి, సామరస్యం, సమానత్వం, నిస్వార్థ సేవ చేస్తున్నామని తెలిపింది.మరోవైపు.ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పార్మట్టా పర్రమట్టా పార్లమెంట్ సభ్యుడు ఆండ్రూ చార్ల్‌టన్( Andrew Charlton ) బీఏపీఎస్ ఆలయానికి చేరుకున్నారు.అనంతరం స్థానిక అధికారులతో కలిసి గోడకు తిరిగి పెయింట్ వేసేలా చర్యలు తీసుకున్నారు.

Telugu Andrew Charlton, India, Australia, Baps, Hindutemple, Narendra Modi, Sris

కాగా.ఈ ఏడాది ప్రారంభంలో మెల్‌బోర్న్‌లోని మూడు హిందూ దేవాలయాలు, బ్రిస్బేన్‌లోని రెండు హిందూ దేవాలయాలను ఖలిస్తాన్ మద్ధతుదారులు ధ్వంసం చేయడం కలకలం రేపింది.దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది.ఈ ఘటనల వెనుక వున్న వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందిగా భారత ప్రభుత్వం ఆస్ట్రేలియాను కోరింది.ఇకపోతే.మే 24న జరిగే క్వాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోడీ సిడ్నీకి వెళ్లనున్నారు.

ఆయన పర్యటన నేపథ్యంలోనే సిడ్నీలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube